కష్టసుఖాల్లో అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనకు ఒక్క ఫోన్ చేయమని మల్లవరపు పెదకొండబాబు కుటుంబానికి యువనేత జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక కింతలివల్లాపురానికి చెందిన కొండబాబు మనోవేదనతో మృతి చెందారు. బుధవారం రాత్రి 8 గంటలకు జగన్ వారింటికి చేరుకొని మృతుని భార్యను, ఇద్దరు పిల్లల్ని ఓదార్చారు. సుమారు 20 నిమిషాలపాటు వారి ఇంట గడిపి చిన్నారులు మల్లిక, తరుణ్‌లను ఒడిలోకి తీసుకొని ముద్దాడారు. కొండబాబు తల్లిదండ్రులు రాజు, పైడమ్మ, చెల్లెలు రత్నంతో మాట్లాడారు. ఏ ఆపద వచ్చినా నేనున్నానని వారికి ధైర్యం చెప్పారు. తమ ఇంటికి వచ్చి కన్నీరును తుడిచిన జగన్‌కు తామెప్పుడూ రుణపడి ఉంటామని మృతుడి భార్య, తల్లిదండ్రులు చెప్పారు.
ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......
Thursday, January 6, 2011
ఉద్విగ్న క్షణాలు..
కష్టసుఖాల్లో అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనకు ఒక్క ఫోన్ చేయమని మల్లవరపు పెదకొండబాబు కుటుంబానికి యువనేత జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక కింతలివల్లాపురానికి చెందిన కొండబాబు మనోవేదనతో మృతి చెందారు. బుధవారం రాత్రి 8 గంటలకు జగన్ వారింటికి చేరుకొని మృతుని భార్యను, ఇద్దరు పిల్లల్ని ఓదార్చారు. సుమారు 20 నిమిషాలపాటు వారి ఇంట గడిపి చిన్నారులు మల్లిక, తరుణ్‌లను ఒడిలోకి తీసుకొని ముద్దాడారు. కొండబాబు తల్లిదండ్రులు రాజు, పైడమ్మ, చెల్లెలు రత్నంతో మాట్లాడారు. ఏ ఆపద వచ్చినా నేనున్నానని వారికి ధైర్యం చెప్పారు. తమ ఇంటికి వచ్చి కన్నీరును తుడిచిన జగన్‌కు తామెప్పుడూ రుణపడి ఉంటామని మృతుడి భార్య, తల్లిదండ్రులు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment