Showing posts with label veerappa moili. Show all posts
Showing posts with label veerappa moili. Show all posts

Friday, August 13, 2010

వద్దే వద్దు! పార్టీ నేతలకు సోనియా ఆదేశం - కేంద్ర మంత్రి ద్వారా సందేశం

 
తాడోపేడో తేల్చేందుకే సిద్ధం
జగన్ వెంట ఎందరున్నారని ఆరా
వ్యతిరేకుల స్వరానికి ప్రోత్సాహం
ముందుకే వెళతానంటున్న జగన్
ప్రకాశంలో యాత్ర పొడిగింపు!
వైఎస్ సభ పోస్టర్ ఆవిష్కరణ
మళ్లీ ఆదేశం.... ఈసారి ఏకంగా అధినాయకురాలి నుంచే!
అదే నిర్దేశం... పార్టీ శ్రేణులన్నింటికీ స్పష్టమైన సందేశం!
'ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ వాదులెవరూ పాల్గొన వద్దు!'
ఇదీ స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జారీ చేసిన తాజా హుకుం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వర్ధంతి మరుసటి రోజు (సెప్టెంబర్ 3) నుంచి, ప్రకాశం జిల్లాలో ఓదార్పు (మూడో విడత) యాత్రను కొనసాగించాలని కడప ఎంపీ జగన్ నిర్ణయించుకోవడంతో ఇక మేడమ్ సోనియగాంధీయే రంగంలోకి దిగారు. యాత్రకు కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లవద్దని, తన మాటగా దీన్ని పార్టీ శ్రేణులకు చెప్పాలని ఆమె ఓ కేంద్ర మంత్రికి సూచించారు. సదరు కేంద్ర మంత్రి శుక్రవారం పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో సోనియాను కలిశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.

కేంద్ర మంత్రి: ఓదార్పు యాత్రలో పాల్గొనడంపై పార్టీ వాదుల్లో అయోమయం ఉంది. ఈ విషయంలో అధిష్ఠానం నుంచి ఇంతవరకూ స్పష్టత లేదు. సోనియా: అయోమయం లేనే లేదు. ఓదార్పు యాత్రలో మీరు పాల్గొనొద్దు. మీరు పాల్గొనక పోవడమే కాదు; మీ తోటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు కూడా, యాత్రకు వెళ్లవద్దని స్పష్టంగా చెప్పండి.

కేంద్ర మంత్రి: యాత్ర విషయంలో దళిత ఎమ్మెల్యేలు, ఎంపిీలు, మంత్రులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. సోనియా: ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పండి. వారికి అండగా నేనున్నాను. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చేది అధిష్ఠానమే అని, వారికి ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇవ్వండి.

కేంద్ర మంత్రి: ఎమ్మెల్యేలకు మా స్థాయిలో మేం చెబుతాం. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ఈ విషయంలో పార్టీ నేతలకు సరైన మార్గదర్శక సూత్రాలు జారీ చేయలేదు. పైగా ఆ యాత్ర జగన్ వ్యక్తిగతమంటూ ప్రకటనలు చేస్తున్నారు. సోనియా: ఏడీ? వీరప్ప మొయిలీ ఎక్కడ? ఆయనతో నేను తర్వాత మాట్లాడతాను. ఇలా చెప్పిన సోనియా, అన్నట్టుగానే తర్వాత మొయిలీని పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత మొయిలీ విలేఖరులకు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఓదార్పు గురించి మాట్లాడడానికి నిరాకరించారు. జగన్ సెప్టెంబర్ 3 నుంచి జగన్ యాత్ర చేస్తున్నట్లు తనకు సమాచారం లేదన్నారు.

సోనియాతో గురువారం నాటి తన సమావేశం వివరాలు మీడియాలో రావడం పట్ల మొయిలీ అసహనం వ్యక్తం చేశారు. కాగా జగన్ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆయనకు మద్దతుగా ఉన్నారని సదరు కేంద్ర మంత్రిని సోనియా ఆరా తీశారు. జగన్ యాత్రకు వ్యతిరేకంగా బహిరంగంగా, గట్టిగా మాట్లాడే వారు రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారని కూడా మేడమ్ అడిగినట్టు సమాచారం. అలాంటి వారిని గుర్తించి, తనకు తెలియజేయాలని, వారిని ప్రోత్సహిద్దామని ఆమె అన్నట్టు తెలిసింది.

మొత్తమ్మీద వద్దన్నా యాత్రకు వెళుతున్న జగన్ విషయంలో అధిష్ఠానం క్రమంగా పట్టు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఈ విషయంలో ఎలాంటి ప్రత్యక్ష వ్యాఖ్యలు చేయని సోనియా, స్వయంగా రంగంలోకి దిగడం హైకమాండ్ సీరియస్‌నెస్‌ను సూచిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. చూస్తుంటే, రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని హైకమాండ్ త్వరలోనే చక్కదిద్దబోతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. గీత దాటితే సహించేది లేదన్న స్పష్టమైన సంకేతాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని చెబుతున్నారు.

హైదరాబాద్: అధిష్ఠానం వైఖరి ఎలా ఉన్నా, ఓదార్పు యాత్రలో ముందుకు వెళ్లడానికే జగన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. యాత్రలో పార్టీ వాదులు పాల్గొన వద్దన్న సోనియా నిర్దేశం వెలువడిన కొద్ది గంటల్లోనే జగన్, ఓదార్పు ఆపే ప్రసక్తే లేదని సన్నిహితులకు స్పష్టంచేశారు. అంతేకాదు, ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకు ముందు అనుకున్నట్టుగా వారం రోజులు సరిపోదని, పొడిగించాలని నిర్ణయించడం గమనార్హం.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్‌ను ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి రూపొందించిన వైఎస్ సంస్మరణ సభ పోస్టర్లను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర విషయం చర్చకు వచ్చింది.

జిల్లా వ్యాప్తంగా వైఎస్ విగ్రహాల స్థాపనకు కార్యకర్తలు పట్టుబడుతున్నందున యాత్రకు వారం రోజులు చాలదని, చాలా రోజులు పట్టేలా ఉందని జగన్ పేర్కొన్నారు. అధిష్ఠానం అవునన్నా కాదన్నా ఓదార్పు ఆగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అటు నెల్లూరు యాత్రకూ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంపీ మేకపాటి సోదరులు ఈ బాధ్యత తీసుకున్నారు. ఇది ఆనం (రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి) సోదరులకు మింగుడు పడడం లేదన్న ప్రచారం సాగుతోంది.

నెల్లూరు జిల్లా పర్యటన విషయంలో జగన్, ఆనం సోదరులను ఇప్పటి వరకూ సంప్రదించకపోవడం చర్చనీయాంశమైంది. అధిష్ఠానం తాజా నిర్దేశం నేపథ్యంలో జగన్ ప్రకాశం యాత్రలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఘటన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన యాత్రలో ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొన లేదు. అయితే వారి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో సహా పలువురు ప్రజా ప్రతినిధులు యాత్రలో పాల్గొన్నారు. ఇక ప్రకాశంలో ఏం జరుగుతుందో చూడాలి.

Wednesday, July 28, 2010

కాకినాడలో తెగదెంపుల సంగ్రామమా? జ'గన్' పేలేనా? అటు విప్... ఇటు నిప్పు నేడు 'బల ప్రదర్శన'

తూర్పుగోదావరిలో ఓదార్పు ముగింపు
సభకు రావాలంటూ ఎమ్మెల్యేలకు పిలుపు
35 మంది శాసనసభ్యులు వస్తారని అంచనా
మరింత బయటపడ్డ వర్గ విభేదాలు
తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం
 
అధిష్ఠానంతో ఇక అతకనంత దూరం
బెడిసి కొట్టిన సయోధ్య యత్నాలు
సోనియా మాట ఎత్తేందుకు యువనేత ససేమిరా
తదుపరి ఓదార్పు ప్రకాశం జిల్లాలో!

కాంగ్రెస్‌లో 'కదన స్వరాలు' పురి విప్పుతున్నాయి. వర్గాల మధ్య విభజన రేఖలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. బుధవారం రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 'కాంగ్రెస్‌కు జగన్ తప్ప మరో దిక్కులేదు' అని జగన్ వర్గీయులు పేర్కొనగా... 'మరేం ఫర్వాలేదు! ఆయన పార్టీని వదిలి వెళ్లిపోవచ్చు' అనేలా ప్రత్యర్థులు ఒకింత దీటుగానే బదులిచ్చారు.

సస్పెన్షన్ వేటు పడిన అంబటి రాంబాబు మరోమారు గళమెత్తగా... నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మొట్టమొదటిసారి బహిరంగంగా జగన్‌కు జై కొట్టారు. వీరిద్దరి వ్యాఖ్యలపై ఎంపీలు సర్వే సత్యనారాయణ, వి.హనుమంతరావు, ఎమ్మెల్యే శంకర్‌రావు మండిపడ్డారు. మొత్తానికి... వారూ వీరూ కలిసి కథను మరింత త్వరగా 'క్లైమాక్స్' చేర్చే సంకేతాలు పంపుతున్నారు.

జగన్ వ్యవహారాన్ని దగ్గరుండి పరిశీలించాలని అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే వచ్చేనెల 6న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. అలాగే.. 4వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలోనూ జగన్‌కు సంబంధించిన చర్చ జరిగే అవకాశముంది.

ఇన్ని పరిణామాల మధ్య... తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూలుకు అతీతంగా సాగిన జగన్ ఓదార్పు యాత్ర ముగింపు సభ గురువారం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలు కాకినాడకు చేరుకున్నారు. సభను జగన్ వర్గీయులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీనిని 'బహిరంగ బల ప్రదర్శన'కు వేదికగా మారుస్తున్నారు. సభలో పాల్గొనాల్సిందిగా నేతలకు సమాచారం పంపారు.

తన వర్గీయుడైన అంబటి రాంబాబుపై సస్పెన్షన్ వేటు వేసినా తమాయించుకున్న జగన్... గురువారం నాటి సభలో అధిష్ఠానంపైనా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపైన మాటల తూటాలు పేల్చే అవకాశముందని ఆయన వర్గీయులే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా రణస్థలంలో ముఖ్యమంత్రి రోశయ్యను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలాన్ని రేపాయి.

ఇప్పుడు కూడా తన యాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలను రోశయ్య అడ్డుకుంటున్నారని జగన్ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర నాయకత్వంతో పాటు, అధిష్ఠానంపైనా నిప్పులు చెరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే... అధిష్ఠానానికి తమ బలం చూపడమే లక్ష్యమని, జగన్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు ఏవీ చేయబోరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురువారం జగన్ అలాంటి వ్యాఖ్యలు చేసినా, చేయకపోయినా... ఆయనకూ, అధిష్ఠానానికీ మధ్య పరిస్థితి ఇప్పటికే 'ఉప్పూ, నిప్పు'లా మారింది.

విపక్షాల వాయిదా తీర్మానం నేపథ్యంలో బుధవారం పార్టీ ఎంపీలంతా లోక్‌సభకు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాల గురించి పట్టించుకోని జగన్... విప్‌ను కూడా పక్కకు పడేశారు. ఓదార్పు యాత్రలోనే ఉన్నారు. గురువారం బహిరంగ సభలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వీటన్నింటి నేపథ్యంలో కడప ఎంపీకి, కాంగ్రెస్ అధిష్ఠానానికీ మధ్య అగాథం పూడ్చలేనంతగా పెరుగుతోంది.

జగన్ కాంగ్రెస్‌లోనే ఉండాలని భావిస్తున్న ఆయన వర్గీయులకు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. 'రాజీకి మార్గాలు మూసుకుపోయి కనిపిస్తున్నాయి. ఇలాంటి ధిక్కారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సహించే ప్రసక్తి ఉండదేమో!' అని జగన్ శ్రేయోభిలాషుల్లో ఒకరైన ఎంపీ సబ్బం హరి సైతం అభిప్రాయపడటం గమనార్హం. అధిష్ఠానం మాట ఎలా ఉన్నా... సయోధ్యకు యువనేతే ససేమిరా అంటున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పేరెత్తడానికే ఆయన ఇష్టపడటంలేదని తెలుస్తోంది. తాము అధిష్ఠానం మాటను ధిక్కరించలేమని, ఇదే సమయంలో జగన్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధంగాలేమని ఆయన వర్గీయుల్లోనే కొందరు అంటున్నారు. వీరు సయోధ్య యత్నాలకు శ్రీకారం చుట్టారు. కొందరు నేతలు ఇటీవల వైఎస్ బంధువు వైవీ సుబ్బారెడ్డిని కలివారు.

జగన్‌కు, అధిష్ఠానానికి మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు చొరవ చూపాలని సూచించారు. వారి సూచనలతో వైవీ సుబ్బారెడ్డి కూడా ఏకీభవించారు. అయితే... 'నేను జగన్‌కు ఎలాంటి సలహాలూ ఇవ్వను. మీలో ఎవరో ఒకరు ఆయనను కలసి చెప్పాలనుకున్నది చెప్పండి' అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో సమావేశమయ్యారు. అధిష్ఠానంతో వైరం పెంచుకుంటూ పోవడంకంటే.. సయోధ్యతో ముందుకు సాగడమే మంచిదని తెలిపారు. ఓదార్పు యాత్రలో సోనియాను ప్రశంసిస్తూ ప్రసంగించాలని సూచించారు. దీనికి జగన్ ససేమిరా అన్నారు.
'నా ఓదార్పు యాత్రకు సోనియా అనుమతి ఇవ్వలేదు. ఇది జగమంతటికీ తెలుసు. ఓదార్చేందుకు వస్తానని పావురాలగుట్ట సభలోనే ప్రకటించాను. ఆ మాటను నిలబెట్టుకుంటున్నాను. నాన్న రక్తం నాలో ప్రవహిస్తోంది. బాధిత కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత నాపై ఉంది.

ఇదే విషయాన్ని అధిష్ఠానానికి వివరించాను. యాత్ర పట్ల సోనియా సుముఖతను వ్యక్తం చేయలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ యాత్రలో సోనియాను ప్రశంసించాలని నాతో ఎలా చెబుతారు? ఇది సాధ్యం కాదు. ఆ ఆస్కారమే లేదు'' అని జగన్ తేల్చి చెప్పినట్లు తెలిసింది.

బుధవారం ఎంపీలు సబ్బం హరి, అనంత వెంకట్రామిరెడ్డి, కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ ఢిల్లీలో భేటీ అయ్యారు. జగన్ విషయంపై చర్చించారు. వీరు జగన్‌కు, అధిష్ఠానానికీ మధ్య తెగతెంపులు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిసింది. ఎంపీలు కిళ్లి కృపారాణి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జగన్ పార్టీలో లేకపోతే పార్టీకే నష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సభలో బల ప్రదర్శన...
తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూలుకు అతీతంగా సాగిన 'ఓదార్పు' యాత్ర గురువారం బహిరంగ సభ రూపంలో ముగియనుంది. ఈ సభకు జగన్ అనుచరగణం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఈ సభ వేదికపై జగన్ తన మనసులోని మాటను వెల్లడించాలని నిర్ణయించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

సభకు సరిగ్గా ఒక్కరోజు ముందు... అంబటి రాంబాబు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా భావించలేమని.. జగన్ మనసులోని మాటలుగానే పరిగణించాల్సి వస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

ఇప్పటిదాకా ఏదైనా జిల్లాలో ఓదార్పు యాత్ర ముగింపు సమయంలో జగన్ తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడమే జరిగింది. తొలిసారిగా కాకినాడలో బహిరంగ సభకు వేదికను సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది. ఈ సభకు సాధ్యమైనంత మంది ఎక్కువ ఎంపీలను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుచర గణంతో సహా తరలి రావాలంటూ నేతలకు పిలుపులు వెళ్లాయి.

ఇప్పటికే జగన్ వర్గీయులుగా పేరొందిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు), అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), రామచంద్రారెడ్డి (రాయదుర్గం), శివప్రసాదరెడ్డి (దర్శి), పి. రామకృష్ణారెడ్డి (మాచర్ల) కాకినాడలో బస చేశారు. బుధవారం వీరంతా జగన్‌ను కలిశారు.

మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా కాకినాడ చేరుకున్నారు. ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి దంపతులు, ఆళ్లనాని, జోగి రమేశ్ తదితరులు కూడా సభకు వచ్చే వీలుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక.. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు జగన్ యాత్రలో భాగస్వాములయ్యారు. వీరంతా గురువారం నాటి సభలో పాల్గొనే అవకాశముంది. ఏ విధంగా చూసినా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఈ సభలో పాల్పంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

జగన్ వర్గీయులు మాత్రం 35 మంది ఎమ్మెల్యేలు రావడం ఖాయమని చెబుతున్నారు. తదుపరి 'ఓదార్పు' ప్రకాశం జిల్లాలో ఉంటుందని జగన్ ఈ సభలోనే ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు. త్వరలో తెలంగాణలోనూ జగన్ యాత్ర నిర్వహిస్తారని గట్టు రామచంద్రరావు కాకినాడలో తెలిపారు. జగన్ గురువారం రాత్రి రైలులో హైదరాబాద్‌కు బయలుదేరతారు.

Sunday, July 18, 2010

జగన్‌కు ఓదార్పు * మీ ఆప్యాయత అపారం ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్య * హైకమాండ్ కొరడా * కడప ఎంపీ విధేయుడు రాంబాబుపై తొలిదెబ్బ* జగన్ వర్గంలో కలవరం సన్నిహితులతో కడప ఎంపీ మంతనాలు

 
 జగన్‌కు ఓదార్పు
'జగన్‌పై చర్యలు తీసుకోం.. ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగతమైనది.' అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీర ప్ప మొయిలీ తేల్చి చెప్పడం జగన్ వర్గానికి ఊరటనిచ్చింది. 'ఓదార్పు'లో పాల్గొంటే అధిష్ఠానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకుల్లో చాలా మంది శనివారం జరిగిన ఆరో రోజు యాత్రలో పాల్గొన్నారు. దీంతో జగన్ వర్గంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మొయిలీ ప్రకటనలో జగన్‌కు నేతల 'ఓదార్పు' ఎక్కువైంది. రాజమండ్రి ఆర్అండ్‌బీ అతిథిగృహం నుంచి శనివారం ఉదయం పది గంటలకు బయలుదేరిన జగన్ సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రి నగరంలోనే పర్యటించారు. లాలాచెరువు, క్వారీ మార్కెట్, మోరంపూ డిలలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

నేను ఒంటరిని కాదు
'నేను ఒంటరివాడైపోయాడ నుకుంటున్నారు.. ఇంత మంది అభిమానం ఉన్న జగన్ ఒంటరివాడెలా అవుతాడు. ఇంత ఆత్మీ యాను రాగాలు పంచుతున్న మీ అందరూ నా వెంటే వుంటే ఒం టరినెలా అవుతాను' అంటూ జగన్ ఉద్వే గంగా మాట్లాడారు. మీరంతా నా తండ్రి రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. నన్ను తమ్ముడిగా, అన్నగా, కొడుకుగా ఆదరిస్తున్న మీ అందరికీ రుణపడి ఉన్నానన్నారు.

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని భయపడకుండా చాలా మంది నేతలు నా వెంట వస్తున్నారు. ఎవరూ ఎవరికీ భయప డాల్సిన అవసరం లేదు.. మీరంతా నా వెంట ఉండటం నాకు కొండంత బలాన్నిస్తోందని జగన్ చెప్పుకొచ్చారు. తనను రాజమండ్రి లోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎంతగానో ఆదరిస్తున్నారని క్వారీ మార్కెట్‌సెంటర్‌లో జరిగిన సభలో జగన్ చెప్పారు.

జక్కంపూడికి పరామర్శ
ఉదయం 10.30 గంటకు మాజీ మం త్రి జక్కంపూడి రామ్మోహనరావును పరామర్శించేందుకు జగన్ ఆయన ఇంటికి వెళ్లారు. మంత్రి బోస్, జక్కం పూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, గణేష్‌లు జగన్‌ను గజమాలతో స్వాగ తించారు. ఈ సందర్భంగా జై జగన్, జై వైస్సార్ అంటూ నినాదాలు చేశా రు. సుమారు అరగంట సేపు గడిపిన జగన్ జక్కంపూడి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇటీవల ఆరోగ్యం కాస్త మెరు గుపడిందని జక్కంపూడి కుటుంబ సభ్యులు జగన్‌కు వివరించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తాకిడి
జగన్ ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తి గతం.. అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా యాత్రలో పాల్గొనేం దుకు ఉత్సాహం చూపారు. జిల్లాకు చెందినరాజమండ్రి సిటీ, అనపర్తి, గన్నవరం ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్ర కాశరావు, నల్లమిల్లి శేషారెడ్డి, పాముల రాజేశ్వరీదేవిలతో పాటురైల్వేకోడూ రు, రాజంపేట, ఏలూరు ఎమ్మెల్యేలు కె.శ్రీనివాసులు, అమర నాథ రెడ్డి, ఆళ్ల నాని, ఎమ్మెల్సీలు కందుల దుర్గేష్, చైతన్యరాజు, పుల్లా పద్మావతి యాత్ర లో హుషారుగా పాల్గొన్నారు.


నాలుగు కుటుంబాలకు ఓదార్పు
ఓదార్పు యాత్రలో భాగంగా శని వారం రాజమండ్రిలో జగన్ నాలుగు కుటుంబాలను కలసి ఓదార్చారు. ఏవి అప్పారావు రోడ్ ఏరియాలో రెడ్డి సూ ర్యప్రకాశరావు, గంజి శేఖర్, అన్న పూర్ణ మ్మపేటకు చెందిన ఆగురి నరసింహమూర్తి, నా రాయణపురానికి చెందిన బొడ్డు ప్రసాదరావుల కుటుం బాలను జగన్ పరామర్శించి ఓదార్చా రు.ఆయా కుటుంబాల వా రితో జగ న్ రెండు గంటలసేపు గడిపారు. కుటుంబ సభ్యుల పరిస్థితి, ఆర్థిక స్థితిగతులపైనా ఆరా తీసిన జగన్ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు మోరంపూడి సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ అక్కడి నుంచి దివాన్‌చెరువు వెళ్లి మా గాపు ధర్మయ్య కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత నరేంద్ర పురం, రాజానగరం చేరుకుని వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు.
మీ ఆప్యాయత అపారం 
ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్య
ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా
నాకు అండగా ఉన్నారు
ఆరో రోజు ఐదుగురికి పరామర్శ
ఓ పక్క ఓదార్పు మరో పక్క రహస్య చర్చలు
మొయిలీ వ్యాఖ్యల తర్వాత పెరుగుతున్న మద్దతు

"ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా..మీ రంతా నాకు అండగా నిలబడుతున్నారు. ఇంతటి ఆప్యాయత చూపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు'' అని కడప ఎంపీ జగన్ అన్నారు.

రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మిలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కాగా,తూర్పు గోదావరి జిల్లాలో ఆరోరోజు యాత్రలో భాగంగా శనివారం ఐదు కుటుంబాలను పరామర్శించారు. పలుచోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు.


ఉండవల్లితో మంతనాలు
యాత్రలో భాగంగా శనివారం రాజమండ్రి వచ్చిన జగన్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇంటికి వెళ్లి సుమారు అరగంటసేపు ఉన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక రాజకీయ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జక్కంపూడి ఇంటికి వెళ్లిన జగన్ ఆయనతోనూ రహస్య చర్చలు జరిపారు.

సీమ,తెలంగాణ ఎమ్మెల్యేలతో..
యాత్ర వద్దని ఇప్పటి వరకు స్పష్టం చేసిన అధిష్ఠానం కాస్త మెత్తబడినట్లు కనిపించడం, ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగతమని, జగన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మొయిలీ వ్యాఖ్యానించడంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. రాయలసీమ, తెలంగాణ జి ల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు జగన్‌తో మంతనాలు జరపడానికి రాజమండ్రి చేరుకున్నారు.

కడప నుంచి మేయర్..
జగన్ యాత్రకు కడప జిల్లా నుంచి మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు రాజంపేట ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కేశ్రీనివాసులు వచ్చారు.

అనంత నుంచి ఇద్దరు..
ఓదార్పు యాత్రలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

కర్నూలు నుంచి...
ప్రజారాజ్యం పార్టీ నేత, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి రాజమండ్రి నుంచి యాత్రను అనుసరిస్తుండగా.. కాంగ్రెస్ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి గడచిన నాలుగు రోజులుగా జగన్ వెంట ఉన్నారు. మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి రెండు రోజులు పాల్గొని శుక్రవారం వెళ్లిపోయారు. కర్నూలు మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటేశ్వర్లు కూడా యాత్రలో పాల్గొని శుక్రవారం కర్నూలు చేరుకున్నారు.

వైఎస్ కుటుంబంతోనే..: మంత్రి బోస్
తాను రాజకీయాలలో ఉన్నంత వరకు వైఎస్ కుటుంబంతోనే ఉంటానని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్‌కు కృతజ్ఞతగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు.

అధిష్ఠానానికి తెలిసొచ్చింది: కడప మేయర్
ఎవరు ఎంత చెప్పినా.. ప్రజాదరణ కలిగిన నేత ఎవరో అధిష్ఠానానికి ఇప్పుడు తెలిసిందని, వీరప్ప మొయిలీ తాజా ప్రకటనే ఇందుకు నిదర్శనమని కడప మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్
తక్షణం అమల్లోకి ప్రకటించిన మొయిలీ
సోనియా ఆగ్రహం ఫలితమే
జగన్‌పై చర్యలేదన్న వీరప్పకు క్లాస్ తీసుకున్న అహ్మద్ పటేల్
జగన్ వర్గీయుల వివరాలు అందజేయాలి
నేతలను ఓదార్పునకు దూరంగా ఉంచాలి
మొయిలీపైనే బాధ్యత రోశయ్యకు మేడమ్ పిలుపు
  కాంగ్రెస్ అధిష్ఠానం కొరడా ఝళిపించడం మొదలు పెట్టింది! కడప ఎంపీ జగన్ మోహన్‌రెడ్డి శిబిరంపై తొలి దెబ్బ పడింది! ముఖ్యమంత్రి రోశయ్యను అనరాని మాటలంటూ.. అసభ్య సవాళ్లు విసిరిన జగన్ విధేయుడు అంబటి రాంబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

జగన్‌కు అనుకూలంగా ఉంటారన్న ముద్ర ఉన్న వీరప్ప మొయిలీకి అంతకు కొద్ది గంటల ముందే గట్టిగా క్లాస్ తీసుకుంది. అంతేకాక.. ఆయన నోటితోనే జగన్ వర్గంపై తొలి చర్యను ప్రకటింపచేసింది. ఓదార్పు యాత్రకు దూరంగా ఉండాలంటూ సంకేతాలు పంపాలని మొయిలీని ఆదేశించిన అధిష్ఠానం.. జగన్ వర్గీయుల జాబితా.. వారి నేపథ్యాల వివరాలను అందజేసే బాధ్యతనూ ఆయనకే అప్పగించింది.

ఈ వ్యవహారాలన్నింటినీ చర్చించేందుకు హస్తిన రావాలంటూ రోశయ్యకు కబురు పంపింది. అంతకుముందు ఓదార్పుపై మొయిలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలతో.. యాత్రలో పాల్గొనే నేతల సంఖ్య పెరిగింది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు జగన్ యాత్రలో శనివారం పాల్గొన్నారు.

ఆ ఉత్సాహంలో "ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా మీరంతా నాకు అండగా నిలబడుతున్నారు. ఇంతటి ఆప్యాయత చూపుతున్నందుకు అందరికీ కృతజ్ఞతలు'' అని ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన కడప ఎంపీ.. సాయంత్రానికి అధిష్ఠానం విసిరిన కొరడా దెబ్బకు కంగు తిన్నారు. యాత్ర మధ్యలోనే ఒక చోట కారు తన సన్నిహితులతో మంతనాలు జరిపారు.

జగన్‌పై చర్యలు ఉండవన్న మొయిలీకి అధిష్ఠానం క్లాస్ తీసుకున్న గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు తన అనుయాయులకు ఏం భయం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిందని తెలుస్తోంది. జగన్‌పై క్రమశిక్షణ చర్యల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో మొయిలీ ఈ వ్యాఖ్యలు చేయడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది.

దాంతో గతంలో మాదిరిగానే ఆయనతోనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. దీంతో తన నిష్పాక్షికతను నిరూపించుకునేందుకన్నట్లు.. రాంబాబుపై వేటు వేస్తూ పీసీసీకి మొయిలీ ఉత్తర్వులు పంపారు. కాగా.. తనకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని అంబటి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెప్పారు. అధికారికంగా సమాచారం వచ్చాక స్పందిస్తానన్నారు.

ఎందుకలా చెప్పారు?
ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండవని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సీనియర్ నేతలతో చర్చిస్తున్న సమయంలో ఈ ప్రస్తావన వచ్చిప్పుడు సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎందుకలా చెప్పారు? ఎవరిని అడిగి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు? అంటూ మండిపడ్డారని ఆ వర్గాలు వివరించాయి.

ఆ వెంటనే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్.. కేంద్ర న్యాయ మంత్రి వీరప్ప మొయిలీకి ఫోన్ చేసి, ఎందుకలా వ్యాఖ్యలు చేశారంటూ మందలించారని తెలిసింది. గతంలో ఒకసారి జగన్ విషయంలో అధిష్ఠానం నుంచి మొయిలీ అక్షింతలు వేయించుకున్నారు.

ఓదార్పు యాత్రకు అధిష్ఠానం సానుకూలంగా ఉందని తనతో మొయిలీ అన్నారని, ఆశీర్వదించి పంపారని జగన్ తన శ్రీకాకుళం యాత్రకు ముందు ఢిల్లీలో చెప్పారు. అయితే.. దానిపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేయడం.. అహ్మద్ పటేల్ తనకు ఫోన్ చేయడంతో సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చిన మొయిలీ.. తాను జగన్‌కు అలా చెప్పలేదని వివరణ ఇచ్చుకున్నారు.

కాగా.. మరోసారి ఇదే విషయంలో మొయిలీ అధిష్ఠానం ఆగ్రహానికి గురి కావడం విశేషం. మొయిలీ వ్యాఖ్యలు జగన్ వర్గానికి ఆత్మ విశ్వాసం కలిగించాయని, ఇక ఓదార్పు యాత్రకు పార్టీ నేతలు నిర్భయంగా హాజరవుతారని, దీని వల్ల మళ్లీ రాజకీయ సమస్యలు ఏర్పడతాయని పార్టీ నేతలు ఒకరిద్దరు అధిష్ఠానం దృష్టికి తీసుకురావడంతో ఈ మందలింపు వ్యవహారం జరిగిందని తెలిసింది.

అంతేకాక.. ఓదార్పు యాత్రకు హాజరు కావద్దన్న స్పష్టమైన సంకేతాలు పార్టీ నేతలకు పంపే బాధ్యతను కూడా మొయిలీకే అప్పగించినట్లు సమాచారం. వీటితో పాటు.. జగన్ వర్గీయులైన ఎమ్మెల్యేల గురించి, వారి నేపథ్యం గురించి కూడా సరైన సమాచారం అందించాలని మొయిలీని అధినాయకత్వం కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జగన్‌పై క్రమశిక్షణ చర్యలు ఉన్నా లేకపోయినా, ఆ విషయం బయటకు చెప్పనవసరం లేదని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధిష్ఠానం అనుమతి లేకున్నా.. కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయనపై చర్య తప్పకపోవచ్చని ఏఐసీసీ వర్గాలు ముందు నుంచి చెబుతూనే ఉన్నాయి.

కొంత సమయం వేచి చూసి.. ఆ తర్వాత తగిన చర్య తీసుకోవాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉందన్న సంకేతాలూ వచ్చాయి. అయితే.. శుక్రవారం నగర పర్యటనకు వచ్చిన వీరప్ప మొయిలీ.. జగన్ యాత్ర వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండవని చేసిన వ్యాఖ్యలతో జగన్‌కు ఊరట లభించినట్లయింది. పలువురు ఎమ్మెల్యేలు జగన్ యాత్రలో చేరారు.

దీనిని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. జగన్ ఓదార్పు యాత్ర ఇంకా కొనసాగుతున్నందువల్ల ఆయన వ్యవహార శైలిని ఇంకా పరిశీలించాల్సి ఉన్నదని, ఆయన విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇప్పుడే తొందరపడకూడదనే అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్నదని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.

అంత మాత్రాన జగన్ కార్యకలాపాలను పూర్తిగా ఉపేక్షించినట్లు భావించరాదని స్పష్టం చేస్తున్నాయి. కాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కలుసుకుని, రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై చర్చించారు. 

జగన్ వర్గంలో కలవరం
సన్నిహితులతో కడప ఎంపీ మంతనాలు

పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబుపై కాంగ్రెస్ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేయడం కడప ఎంపీ వైఎస్ జగన్ వర్గానికి గట్టి షాక్‌నిచ్చింది. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలన్నీ పత్రికల ఊహాజనితాలేననని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ప్రకటించడంతో అంతా సద్దుమణిగిందని, పరిస్థితులన్నీ తమ 'దారి'కే వచ్చాయని జగన్ వర్గం భావిస్తున్న తరుణంలో.. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఆ వర్గాన్ని కలవరానికి గురి చేసింది.

జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, దాదాపు ఆయన అధికార ప్రతినిధిగా మెలగుతున్న అంబటి రాంబాబు.. ఇటీవల రోశయ్యపై పరుషమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని రోశయ్య, డీఎస్‌లు తీవ్రంగా పరిగణించారు. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. క్రమశిక్షణరాహిత్యాన్ని మొగ్గలోనే తుంచేయాలని అధిష్ఠానం ఆదేశించింది కూడా.

ఈ నేపథ్యంలోనే పీసీసీ క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులతో కమిటీ ముందు హా జరైన అంబటి.. మరికొంత గడువు కోరారు. కమిటీ గడువు ఇచ్చింది కూడా. అయితే.. ఆ తర్వాత కూడా అంబటి ధిక్కార స్వరాన్నే వినిపించారు. దీంతో, అంబటి అంశాన్ని శుక్రవారం హైదరాబాద్ వచ్చిన మొయిలీకి పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ సత్యనారాయణరాజు ఓ నివేదికను సమర్పించారు.

అదేసమయంలో, ఓదార్పుపై మొయిలీ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో లక్ష్మణరేఖను దాటేవారి సంఖ్య అధికంగా ఉంటుందని అధిష్ఠానం ఆందోళన చెందింది. దీంతో ఈ వ్యవహారాన్ని మొగ్గలోనే తుంచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. సమాధానం చెప్పడానికి ఇంకా గడువు ఉన్నా అంబటిపై వేటు వేసింది. ఈ విషయాన్ని మొయిలీతోనే చెప్పించింది.

తద్వారా.. కిందిస్థాయి నుంచి ఇన్‌చార్జి వరకూ ఎవరు గీత దాటినా కఠినంగానే వ్యవహరిస్తామం టూ పరోక్షంగా మొయిలీకి కూడా అధిష్ఠానం హెచ్చరికలు పంపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంబటిపై చర్యల ద్వారా.. భవిష్యత్తులో జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే ప్రజాప్రతినిధులపైనా ఇదే వైఖరిని అవలంబించనున్నట్లు హెచ్చరికలను పంపిందని చెబుతున్నాయి.

అయితే, అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై తనవారిని కాపాడుకొనే విషయంలో వైఎస్ ఎప్పుడూ ముందుండేవారని.. ఆ యన తనయుడిగా ఇప్పుడు జగన్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి పార్టీలో నెలకొంది. అంబటిపై వేటు విషయం తెలిసిన వెంటనే.. ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ తన సన్నిహితులు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, రాపాక వరప్రసాద్‌లతో శనివారం రాత్రి మంతనాలు జరిపారు.

రాజమండ్రి రూరల్ మండలంలోని నామవరంలో ఓదార్పు యాత్రకు బయలుదేరిన జగన్.. మార్గమధ్యలో కారు ఆపి ముగ్గురితోనూ ఐదు నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది.

Saturday, July 17, 2010

కీలక మలుపు * సర్దుకుపోదాం..రా.. ! * సామాజికవర్గాల సమీకరణం * 'ఓదార్పు' యాత్రలో యువ నాయకత్వం!

 కీలక మలుపు
జిల్లాలో కడప ఎంపీ జగన్‌మోహనరెడ్డి నిర్వహిస్తున్న ఓదార్పుయాత్ర అయిదోరోజుకు చేరుకుంది. అనూహ్యంగా శుక్రవారం రాత్రి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సామర్లకోటలో జగన్‌ను కలిశారు. దీంతో యాత్ర కీలక మలుపు తిరిగింది. బోస్ చేరికతో జగన్ బలం పుంజుకున్నట్టయింది. ఇప్పటికే తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం తమ తమ నియోజకవర్గాల్లో జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

రంపచోడవరం ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు ఓదార్పు యాత్రకు దూరంగా ఉన్నారు. జిల్లాలో ఓదార్పు యాత్ర ముగిసే వరకు జగన్ వెంట బోస్ పర్యటించనున్నారు. గురువారం రాత్రి కిర్లంపూడిలో బసచేసిన జగన్ శుక్రవారం ఉదయం దివిలి నుంచి పర్యటన ప్రారంభించారు. పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏటిపట్టు గ్రామాల్లో యాత్ర కొనసాగించారు. తొలుత పిఠాపురం మండలం మంగితుర్తిలో యర్రవరపు రాజు కుటుంబాన్ని ఓదార్చారు.

విరవ, విరవాడ, మల్లాం, ఫకృద్దీన్‌పాలెం, కొత్త కందరాడల్లో యాత్ర కొనసాగించారు. సామర్లకోట మండలం చంద్రంపల్లి, నవర, పి.వేమవరం, ఉండూరుల్లో పర్యటించారు. కొత్త కందరాడలో ఎ.సుబ్బారావు కుటుంబాన్ని, చంద్రంపాలెంలో దమ్మాల చక్రం కుటుంబాన్ని, ఉండూరులో జి.వీర్రాజు కుటుంబాన్ని ఓదార్చారు.

సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో కూడా జగన్ పర్యటించారు. మల్లాం, విరవాడ, ఫకృద్దీన్‌పాలెం, చంద్రంపాలెం, పి.వేమవరం, సామర్లకోట, పెద్దాపురం తదితర చోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ముక్తసరిగా మాట్లాడారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తాను ప్రాధాన్య మిస్తున్నట్టు జగన్ తెలిపారు. తన యాత్రలో భాగంగా ముఖ్యనేతల ఇళ్లకు వెళ్లి మంతనాలు జరిపే కార్యక్రమా లను జగన్ కొనసాగిస్తున్నారు.

కిర్లంపూడిలో మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఇంట్లో బసచేసిన ఆయన శుక్రవారం ఉదయం వీరవరం వెళ్లి జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. యాత్రలో భాగంగా మధ్యాహ్నం విరవాడలో పిఠాపురం మండల పరిషత్ అధ్యక్షుడు రాంబాబు ఇంట్లో భోజనం చేశారు. రెండుచోట్ల చాలాసేపు జగన్ గడపడం విశేషం. జగన్‌ను కలిసేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు పలువురు కిర్లంపూడి వచ్చారు. మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిక్కిన కృష్ణార్జునచౌదరి, వడ్డి వీరభద్రరావు తదితరులు జగన్‌ను కలిపారు. మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యేలు తోట గోపాలకృష్ణ, వరుపుల సుబ్బారావు జగన్ వెంట యాత్రలో పాల్గొన్నారు.

శాసనమండలి సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి (వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు) కిర్లంపూడి వచ్చి జగన్‌ను పరామర్శించారు. పిఠాపురం మండలం ఫకృద్దీన్‌పాలెంలో జగన్‌ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే సత్యవతి ఓదార్పుయాత్రకు సంఘీభావం తెలిపారు. గ్రూపు రాజకీయాల కారణంగా ఒకరిద్దరు నేతలు మౌనంగా ఉన్నప్పటికీ పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు జగన్ యాత్రలో పాల్గొనడం గమనించాల్సిన విషయం.
జిల్లాలో బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలను సమీకరించేందుకు జగన్ తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే తొలుత ఏడు రోజులు నిర్వహించాలని భావించిన 'ఓదార్పు' యాత్రను పొడిగించనున్నట్టు తెలుస్తోంది. కోనసీమకు చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు, ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ జిల్లాలో బలమైన సామా జికవర్గాలకు చెందిన నేతలుగా వున్నారు.

జిల్లా రాజకీయాల్లో సామా జికవర్గాలను బేరీజు వేసుకునే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ సామాజికవర్గ రాజకీయాలకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 'ఓదార్పు' యాత్ర నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి త నయుడు, కడప ఎంపీ జగన్ కూడా రాజకీయంగా బలమైన ముద్ర వేసుకునేందుకు తన వెనుక బలమైన సామాజికవర్గ నేతలు ఉన్నారన్న సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లా కాంగ్రెస్ పార్టీలో జగన్ ఇప్పటికే మెజార్టీ నేతల మద్దతు కూడగట్టుకోగలిగారు. పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇంచుమించు అందరూ జగన్‌కు అనుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ముగ్గురు ఎంపీల్లో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇప్పటికే జిల్లాకు వచ్చిన జగన్‌ను పలకరించారు. కాకినాడ ఎంపీ పళ్లంరాజు జగన్ ఓదార్పుపై, ఆయన రాజకీయ వ్యవహారాలపై మౌనం వహిస్తున్నారు. అ మలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, జగన్ ఎంపీ కాకముందు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్షకుమార్ సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్‌కు అనుకూలంగా బహిరంగంగానే మాట్లాడుతున్నారు.

జిల్లాలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అధిష్ఠానం వార్నింగ్ ఇచ్చినా జగన్ వెంటే ఉంటానని ముందు నుంచీ స్పష్టం చేస్తూ వస్తున్నారు. బోస్‌కు బలమైన సామాజికవర్గ నేపథ్యం ఉంది. జిల్లా రాజకీయాల్లో ఆరు దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్న సామా జికవర్గానికి చెందిన మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు, ముద్రగడ పద్మనాభం కూడా జగన్‌కు అండగా నిలబ డ్డారు.

వీరితో పాటు పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే తోట గోపాల కృష్ణ, జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం తదితరులు కూడా జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు. దీంతో జగన్ పలువురు నేతల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

'ఓదార్పు' యాత్రలో యువ నాయకత్వం!

 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి చేపడుతున్న ఓదార్పు యాత్ర ఏర్పాట్లు చేయడంలో యువనాయకత్వం తాజాగా తెరపైకి వస్తుంది. ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తనయులు, యువనాయకులు జగన్మోహన్‌రెడ్డి యాత్ర ఏర్పాట్లలో సీనియర్లను సైతం పక్కన పెట్టి ముందడుగు వేస్తున్నారు. దీనికి తోడు జగన్మోహన్‌రెడ్డితో వైఎస్ఆర్ విగ్రహాలు ఆవిష్కరించాలన్న అభిమానుల అత్యుత్సాహం అనేక చోట్ల వివాదాలకు ఆజ్యం పోస్తుంది.

పబ్లిక్ స్థలాల్లోను, అభ్యంతరకరమైన ప్రదేశాల్లోను, ముఖ్యంగా భవిష్యత్‌లో ఆయా ప్రాంతాల అభివృద్ధికి నిరోధకంగా మారే చోట్ల వైఎస్ విగ్రహాలను కాంగ్రెస్ నాయకులు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఐదవ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పోలీస్‌స్టేషన్ వద్దే దివంగత నేత వైఎస్ఆర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజకీయ వివాదాల నేపథ్యంలో పోలీసులు సైతం అక్కడ పెట్టే విగ్రహాల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న విషయం మరింత వివాదమవుతుంది.

అదే రీతిలో అమలాపురంలోని హైస్కూల్ సెంటర్‌లో 214 జాతీయ రహదారి మధ్యలో భారీ స్థూపాన్ని నిర్మించి విగ్రహ ఏర్పాట్లకు మంత్రి విశ్వరూప్ అనుచర గణం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే సెంటర్‌లో వెలుగునిచ్చే ఐ-మ్యాక్స్ లైట్లను తొలగించి విగ్రహం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భవిష్యత్‌లో పాశర్లపూడి-బోడసకుర్రు వంతెన పూర్తయితే ఈ సెంటర్‌లో నిర్మించిన వైఎస్ విగ్రహం ప్రధాన సమస్యగా మారే అవకాశముందని జాతీయ రహదారుల శాఖ అధికారులు లోలోపలే మదనపడుతున్నారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం సమీపాన వైఎస్ విగ్రహా ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ నాయకులు చర్యలను ఆ ప్రాంత దళితులు అడ్డుకోవడం ద్వారా నిలిచిపోయింది.

అదే విధంగా చల్లపల్లి శివారు బొండాడిపేటలో వైఎస్ జగన్‌తో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని పలువురు కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రతిపాదనను మరికొందరు దళిత నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వివాదం ప్రారంభమైంది. అదే రీతిలో కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలో రహదారుల చెంత కాంగ్రెస్ పార్టీ అధికారులు నిర్మిస్తున్న వైఎస్ఆర్ విగ్రహాలు భవిష్యత్‌లో వివాదాస్పదం కానున్నాయి.

ప్రస్తుతం నెలకొల్పుతున్న విగ్రహాల చెంతనే దివంగత తెలుగుదేశం నేత ఎన్టీఆర్‌తో పాటు దళిత నాయకుల విగ్రహాలను ఆయా కూడళ్లలో ఏర్పాటు చేయడానికి ప్రత్యర్థులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కోనసీమలో వేలాది విగ్రహాలు ఉన్న తరుణంలో వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం వల్ల కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదాలకు నాంది పలికే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

యువ నాయకత్వం హడావుడి:
జగన్ కోనసీమ పర్యటన నేపథ్యంలో కొత్త తరం యువజన కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తున్నారు. భారీగా తమతమ ఫొటోలతో జగన్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణార్జున రెడ్డి జగన్ యాత్ర ఏర్పాట్లలో అనుచర గణంతో బిజీగా ఉన్నారు. మంత్రి తనయుడు సెంటర్‌లో ఓ భారీ ఫ్లెక్స్‌ను ఏర్పాటుచేశారు. అదే రీతిలో కాంగ్రెస్ నాయకుని తనయుడు కె.మదన్ భారీ ఫ్లెక్స్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏర్పాట్లకు దూరంగా ఉన్న గన్నవరం నియోజకవర్గ నాయకులు జగన్ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. అలాగే చిర్ల జగ్గిరెడ్డి, కేవీ సత్యనారాయణరెడ్డిలు కొత్తపేట నియోజక వర్గంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్దుకుపోదాం..రా.. !
jagan-delhi
రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న ఉత్కంఠ పరిణామాలు కొత్త మలుపు తిరిగాయి. ఇంతవరకూ అధిష్ఠానాన్ని ధిక్కరిం చి ఓదార్పు యాత్రలో ఉన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌పై చర్యలు ఉంటాయని భావిస్తూ వచ్చిన వారి అంచనాలు తారుమారయ్యాయి. ఆయనపై ఎలాంటి చర్యలూ ఉం డవని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ వీరప్ప మొయిలీ అధికారికంగా ప్రకటించడంతో కాంగ్రెస్‌ రాజకీయాల వేడి ప్రస్తుతానికి చల్లారే సూచనలు కనిపి స్తున్నాయి.

శుక్రవారం నగరానికి వచ్చిన మొయిలీ.. ఓదార్పు యాత్ర జగన్‌ వ్యక్తిగత వ్యవహారమయినందున, ఆయ నపై ఎలాంటి చర్యలూ ఉండవని స్పష్టం చేయడం పరిశీ లిస్తే.. జగన్‌పై అధిష్ఠానం వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. జగన్‌ ఓదార్పు యాత్రలో కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నేతలే ఎక్కువగా రావడం, వారంతా జగ న్‌ పార్టీ పెడితే వెళ్లిపోతామంటూ విస్పష్టంగా ప్రకటించ డం, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అధిష్ఠానం మాట ను ఖాతరు చేసే పరిస్థితి కనిపించకపోవడం వంటి అం శాలను నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

SONజగన్‌ యాత్రకు వచ్చిన జాతీయ మీడి యా ప్రతినిధుల ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తెలు సుకున్న అధిష్ఠానం, వాటిని పరిగణనలోకి తీసుకున్న ట్లు కనిపిస్తోంది. అయితే, జగన్‌పై అటు కఠినంగా వ్యవహరించకుండా, ఇటు మరీ జారిపోకుండా ఉండే లా వ్యూహం రూపొంది స్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి. జగన్‌ తనంత ట తాను పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకూ అతడిని రెచ్చకొట్టకూడదని, యాత్ర వ్యవ హారంపై మరీ ప్రతిష్ఠకు పోకుండా చూసీ చూడనట్లు వ్యవహరించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు మారిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

జగన్‌ వెంట ఆశించి నంత సంఖ్యలో ఎమ్మెల్యే, ఎంపీలు వెళ్లకపోయినా.. పార్టీకి పునాదిరాళ్లయిన ద్వితీయ శ్రేణి నేతలు జగన్‌ వైపు కదులుతుండటంపైనే నాయకత్వం ప్రధానంగా దృష్టి సారించి, తన వైఖరిని తాత్కాలికంగా మార్చుకున్న ట్లు తెలుస్తోంది. వైఎస్‌ మృతి చెందిన తర్వాత జనాకర్ష క శక్తి ఉన్న నేత పార్టీలో ఎవరూ లేకపోవడం, ప్రస్తుతా నికి జగన్‌ ఒక్కరే ప్రత్యామ్నాయ జనాకర్షక శక్తి ఉన్న నేతగా కనిపిస్తుండటంతో.. జగన్‌ వ్యవహారాన్ని తెగేదా కా లాగి, రెచ్చగొట్టడం వల్ల పార్టీకే నష్టమన్న భావనతో నాయకత్వం మనసు మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు విశ్లే షిస్తున్నాయి.

MOHILI యువకుడయి నందున జగన్‌ను ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నదీ అధి ష్ఠానం గ్రహించినట్లు కనిపి స్తోంది. ఇన్ని కారణాలు సమీక్షించుకున్న తర్వాతనే జగన్‌ యాత్రపై చూసీ చూడ నట్లు వదిలేయాలని నిర్ణయించింది. జగన్‌ యాత్రలో ద్వితీయ శ్రేణి నేతలు అధికంగా ఉన్న విషయాన్ని గ్ర హించిన నాయకత్వం.. వారు బయటకు వెళితే పార్టీకే నష్టమని, ఇప్పటికే ఎమ్మెల్యేలు అభ ద్రతాభావంతో ఉన్న వాస్తవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. ద్వితీ య శ్రేణి నేతలు జారిపోతారన్న భయంతోనే ఎమ్మెల్యే లు యాత్రకు వెళుతున్న అనివార్య, అయోమయ పరిస్థి తి నుంచి ఎమ్మెల్యేలను బయట పడవేసేందుకే అధిష్ఠా నం జగన్‌కు ప్రస్తుతానికి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సోనియాకు సీనియర్లే తప్పుదోవ వట్టించారు

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రపై యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కొంత మంది సీనియర్లే తప్పుదోవ పట్టించా రని కడప ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రముఖ శిల్పి వడయార్ శిల్పకళాశా లకు విచ్చేసి పులివెందులలో ఏర్పాటు చేసేందుకు తయారు చేస్తున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 18 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన పరిశీలించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ జగన్ ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీ తరఫున చేపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమ య్యేదన్నారు. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడిందని పేర్కొన్నారు. ఓదార్పు యాత్ర విషయంలో కొందరు సీనియర్లు కావాలనే అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

అయితే ఓదార్పు యాత్రతో జగన్ వేరే పార్టీ పెడతారని వస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికే తాము పాటుపడతామని వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఆయన వెంట కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాంగ్రెస్ బ్లాక్ వన్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్ మార్గన గంగాధరరావు, రుద్రరాజు రవివర్మ తదితరులున్నారు. 

వ్యూహకర్తలెవరు? జగన్ పర్యటనపై ఇంటెలిజెన్స్ ఆరా

జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వ హస్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్మో హనరెడ్డి వెనుక వ్యూహకర్తలు ఎవర న్న అంశంపై ఇంటెలిజెన్స్ అధికారు లు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖరరెడ్డికి అత్యంత ఆదరణ చూపిన జిల్లాగా తూర్పు గోదావరి అంటే ఎన లేని అభిమానం. అదే రీతిలో ఆయన తనయుడు జగన్‌కు కూడా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మ రథం పడుతున్నారు. జగన్ జిల్లాలో ఓదార్పు నిర్వహిస్తున్న సమయంలో నే అనేక పరిణామాలు చోటుచేసుకుం టున్నాయి.

వైఎస్‌కు అత్యంత అను యాయుడిగా పేరొందిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ జగన్ ను కలవడంపై అహ్మద్ పటేల్ వివర ణ అడిగినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి, మరికొంత మంది కీలక నేతలు జగన్ ఓదార్పు లో పాల్గొనడానికి కాస్త ఇబ్బంది ప డుతున్నారు. ఇదే సమయంలో జగన్ 'ఓదార్పు'లో ప్రసంగాలను రూపొం దిస్తున్న నేతలు ఎవరు? తర్వాత పార్టీ పెడితే అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి? వీటిని ఎవరు రూపొం దిస్తున్నారు? అనే కోణంలో ఇంటెలి జెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లాలో జగన్ యాత్ర జరుగుతున్న ప్రాంతాలతో పాటు కాకి నాడ, రాజమండ్రి, అమలాపురం లో క్‌సభ స్థానాల వారీగా జగన్‌కు అను కూలంగా వున్న నేతల వివరాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. జగన్ కు సన్నిహితుడిగా పేరొందిన కాకినా డ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు,

ముద్ర గడ పద్మనాభం వంటి నేతలు జగన్ పార్టీ పెడితే బలమైన వర్గంగా తయా రవుతారన్న కోణంలో కూడా ఇంటెలి జెన్స్ సమాచారం సేకరిస్తున్నట్టు చె ప్తున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక నేతల్లో ఎవరెవరు యువ నేత వెంట నిలబడతారు? వ్యతిరేక వర్గంలో ఉంటారు అన్న అంశంపైనా చర్చ జరుగుతోంది.

Wednesday, July 14, 2010

జగన్‌తో భయం లేదు అధిష్ఠానం వద్ద రోశయ్య ధీమా! మధ్యేమార్గానికి యువనేత సంసిద్ధత?

 

అయినా నమ్మలేమని వ్యాఖ్య

మధ్యేమార్గానికి యువనేత సంసిద్ధత?  

విమర్శలు లేనిది అందుకే!  

ఢిల్లీలో రోశయ్య రాజకీయ మంతనాలు

అహ్మద్ పటేల్‌తో మరో మారు భేటీ
చిదంబరంతోనూ సమాలోచనలు
ద్వివేదీ, కేకేతోనూ మంతనాలు
అధిష్ఠానంపైన, రోశయ్య సర్కార్‌పైన తిరుగుబాటు చేసే ఆలోచనను కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి విరమించుకున్నారని తెలుస్తోంది. మరోసారి మధ్యే మార్గాన్ని అనుసరించేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

"జగన్ వల్ల నా సర్కార్‌కు భయం లేదు. ఇదే విషయం ఆయనకు (జగన్‌కు) కూడా అర్థమైనట్లు తెలుస్తోంది'' అని రోశయ్య చెప్పినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రి, బుధవారం మధ్యాహ్నం ఆయన అహ్మద్ పటేల్‌ను కలుసుకున్నప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, ఉప ఎన్నికల గురించి ఆయన వివరంగా చర్చించారు.


ప్రస్తుతానికి జగన్ వల్ల ప్రమాదమేమీలేదని, ఆయన కూడా తన మాటల తీవ్రతను తగ్గించుకున్నారని రోశయ్య చెప్పినట్లు తెలిసింది. అయితే జగన్ ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో చెప్పలేమని, ఆయన ప్రతి అడుగునూ పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్‌కు ఎవరెవరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? వారి నేపథ్యమేంటి? అన్న అంశాలపై కూడా ఆయన అహ్మద్ పటేల్‌తో చర్చించారు.

కాగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ కూడా పరిస్థితి మరింత వేడెక్కకుండా చర్యలు తీసుకున్నారని తెలిసింది. జగన్ తల్లి విజయలక్ష్మి, వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావులతో మాట్లాడి.. జగన్ సంయమనం పాటించేలా చూశారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌కూ, అధిష్ఠానానికి మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా మారేందుకు మరింత సమయం పట్టవచ్చునని తెలుస్తోంది. నిజానికి అధిష్ఠానం జగన్‌కు ఒక దశలో షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైందని, అయితే పరిస్థితి విషమించకుండా మధ్యవర్తులు రంగంలోకి దిగారని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.

జగన్ పోకడను తాము గమనిస్తున్నామని, ఆయనతో మరిన్ని తప్పులు చేయనిచ్చి చర్యలు తీసుకుంటామని ఏఐసీసీ అధికార ప్రతినిధి కూడా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ స్పష్టం చేయడం జగన్ శిబిరంలో కలవరం సృష్టించింది. అంతేకాక అన్ని రకాల రాజకీయ, ఆర్థిక ఆయుధాలను వాడేందుకు అధిష్ఠానం సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.

దీనితో బలబలాలను అంచనా వేయకుండా కత్తి దూసి విఫలమవడం సరైంది కాదని జగన్ శిబిరం అభిప్రాయపడుతోందని సమాచారం. వారు అందుకే మొయిలీ ద్వారా మంతనాలు జరిపి, ముఖ్యమంత్రికి కూడా సంధి సంకేతాలు పంపారని, అధిష్ఠానానికి కూడా అవే సంకేతాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జగన్ ఓదార్పు యాత్రను, మాటల్ని ఎప్పటికప్పుడు గమనించి తప్పనిసరైతేనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆయనను వదిలి వేయాలని పార్టీలో ఒక వర్గం భావిస్తోంది. అయితే ఒకసారి అధిష్ఠానానికి ధిక్కార స్వరాన్ని వినిపించిన తర్వాత ఆయనపై పార్టీలో ఇప్పుడే సానుకూలంగా వ్యవహరించే అవకాశం లేదని అర్థమవుతోంది.

ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలను అధిష్ఠానం తీవ్రంగానే పరిగణిస్తోంది. నేరుగా ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడం ద్వారా జగన్ అధిష్ఠానం కట్టును దాటారని అంటున్నారు. అధిష్ఠానం జగన్‌తో పాటు ఆయన అనుచర గణంపైనా దృష్టి సారించింది. ప్రధానంగా వారి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిందని ఈ వర్గాలు వివరిస్తున్నాయి.

రాజకీయ అవసరాల కోసం సీబీఐ, ఐటీ శాఖలను దాడులకు వినియోగించడం అధికారంలో ఉన్న పార్టీలకు పరిపాటని.. గతంలో మాయావతి, లాలుల విషయంలోనూ ఇలాంటి చర్యలే తీసుకుని వారిని అదుపు చేసిన విషయాన్ని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి.

ఢిల్లీలో అంతా తానై..
ముఖ్యమంత్రి రోశయ్య రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిగొలిపింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి.. పనిలో పనిగా.. రాష్ట్ర రాజకీయాలను అధిష్ఠానం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి అహ్మద్‌పటేల్‌ను కలిసిన రోశయ్య మళ్లీ బుధవారం కూడా 20 నిమిషాలు పాటు సమావేశమయ్యారు.

రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, జనార్దన్ ద్వివేదీలతోనూ సమావేశం కావడం.. చిదంబరంతో దాదాపు 40 నిమిషాల పాటు సమాలోచనలు జరపడం రాష్ట్ర నేతల్లో రాజకీయంగా ఆసక్తిని కలిగించాయి. గతంలో రోశయ్య ఢిల్లీకి వెళ్లినప్పుడు కొంతమంది ఆయన వెంట వెళ్లేవారు. ఈసారి తన వెంట సీఎం కార్యాలయ అధికారి మినహా పార్టీ నేతలెవరూ లేకుండా రోశయ్య జాగ్రత్త పడ్డారు.

ఇదిలా ఉండగా... ఓదార్పు యాత్రలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయమై ఆ జిల్లా ఎమ్మెల్యేలు తర్జన భర్జనలు పడుతున్నారు.

"మా మనసులు ఎక్కడో ఉన్నాయి. మేం ఇక్కడే ఉన్నాం.. అటు వెళ్లాలో ఇక్కడ ఉండాలో తెలియక మానసిక కల్లోలానికి గురవుతున్నాం. ఫలితంగా రక్తపోటు పెరిగిపోతోంది. అందుకే వైద్యపరీక్షలకు వెళ్తున్నా'' అని రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆన్‌లైన్‌తో అన్నారు.

శాసనసభ సమావేశాల అనంతరం యాత్రలో పాల్గొంటానని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఘంటాపథంగా చెబుతుంటే.. అదే జిల్లాకు చెందిన పినిపె విశ్వరూప్ మాత్రం ఏ విషయాన్నీ స్పష్టం చేయడం లేదు.

వచ్చే నెల 8,9,10 తేదీల్లో ప్రకాశం జిల్లాలో జరిగే ఓదార్పు యాత్రలో పాల్గొంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తమ జిల్లాలో జరిగే ఓదార్పు యాత్రలో ఒకరిద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రూట్‌మ్యాప్ రూపొందిస్తామని వివరించారు.

Tuesday, July 13, 2010

అంతొద్దు! వాడి తగ్గించాలన్న మొయిలీ - ‘ఓదార్పు ’ వివాదానికి విరుగుడు మంత్రం మెయిలీ బాణం !

విజయమ్మ, కేవీపీలకు ఫోన్
జగన్ సంయమనానికి అదే కారణం?
సీఎం ఢిల్లీ యాత్రపై నేతల్లో ఆసక్తి
 
శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో వాడి వేడి వ్యాఖ్యలు చేసిన కడప ఎంపీ వైఎస్ జగన్ తూర్పు గోదావరిలో ఎందుకు సంయమనం పాటిస్తున్నారు? పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మొయిలీ రంగంలోకి దిగి... జగన్ తల్లి విజయలక్ష్మి, వైఎస్ సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావులకు చేసిన సూచనలే దీనికి కారణమని తెలుస్తోంది.

జగన్ ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అధిష్ఠానం ఆయనకు షోకాజ్ నోటీసు ఇస్తుందనే ప్రచారం సోమవారం విస్తృతంగా జరిగింది. ఇది జగన్ వర్గంలో కలవరం పుట్టించింది. తన వర్గంలో ధైర్యం నూరిపోసేందుకైనా జగన్ మరిన్ని పదునైన వ్యాఖ్యలు చేస్తారేమోనని కొందరు భావించారు. అయితే.. జగన్ నుంచి ఎలాంటి స్పందన కన్పించలేదు. జగన్ ప్రసంగాల్లో వాడి తగ్గించాలని, లేనిపక్షంలో అధిష్ఠానం కఠినంగా వ్యవహరిస్తుందని వైఎస్ సతీమణి విజయలక్ష్మికి మొయిలీ ఫోన్‌లో వివరించారని సమాచారం.

అదేవిధంగా జగన్‌కు అధిష్ఠానం నిర్ణయం ఏమిటో వివరించాలని, సంయమనంతో మాట్లాడాల్సిందిగా సూచించాలని కేవీపీ రామచంద్రరావును మొయిలీ కోరినట్లు సమాచారం. ఇటు తల్లి విజయమ్మ, అటు కేవీపీల సూచనల మేరకే తూర్పు గోదావరి జిల్లాలో జగన్ కాస్త సంయమనం పాటిస్తున్నట్లు అంటున్నారు. మొయిలీ సోమవారం, మంగళవారం ముఖ్యమంత్రి రోశయ్యతోకూడా మాట్లాడినట్లు తెలిసింది. జగన్ వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఢిల్లీ మనసులో మాటేమిటి?
రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ అధిష్ఠానం మనోగతం ఏమిటి? 'ఓదార్పు వేడి'పై పార్టీ పెద్దలు ఏమనుకుంటున్నారు? భవిష్యత్ ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ పర్యటన తర్వాతైనా ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభిస్తాయని పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరప్ప మొయిలీ సోనియాకు ఎలాంటి నివేదిక ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

జూనియర్లకు మంత్రుల క్లాస్!
మంత్రులు, ముఖ్యనేతలను కలుస్తున్న జగన్ అనుకూల జూనియర్ ఎమ్మెల్యేలకు వారి నుంచి పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సంగతులేమిటని ప్రశ్నిస్తూనే.. ఓదార్పు యాత్ర, ప్రజా స్పందన తదితర అంశాలను సీనియర్లు ఆరా తీస్తున్నారు. ఆ తర్వాత... జగన్ పార్టీలో కొనసాగుతారా, లేక వేరే కుంపటి పెడతారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేరుకుంపటి పెడితే, మధ్యంతర ఎన్నికలు వస్తే పార్టీలో ఎంతమంది గెలుస్తారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ వర్గీయుల నుంచి సరైన సమాధానం రావడం లేదంటున్నారు.

జగన్ ఓదార్పు యాత్రలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా 'ఒత్తిడి వ్యూహం' అమలవుతోంది. యాత్ర జరిగే నియోజకవర్గాల్లో జగన్ వర్గీయులు ముందస్తుగా కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు యాత్రలో పాల్గొనేలా ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇదే వ్యూహాన్ని అమలు చేశారు.

స్థానిక ఎమ్మెల్యేలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు... "ఆ ఎన్నికల గురించి తర్వాత! ముందు జగన్ యాత్రలో పాల్గొంటున్నారా లేదా?'' అని కార్యకర్తలతో అడిగించారు. ఈ సమావేశంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పాల్గొన్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యుడొకరు వివరించారు.

రోశయ్యను కలిసిన శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణి
సీఎంను శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణి మంగళవారం కలిశారు. ఓదార్పు యాత్రలో తన భర్త పా ల్గొనడం, ఇతర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. యాత్ర గురించి సీఎం ప్రస్తావించలేదని ఆమె  వివరించారు.

‘ఓదార్పు ’ వివాదానికి విరుగుడు మంత్రం మెయిలీ బాణం !
MOHILI ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరగుతున్న అవాంఛనీయ పరిణామాలకు కళ్లెం వేసే పనిలో పడింది. కడప ఎంపీ జగన్‌ ఓదార్పు యాత్రతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కల్లోల కడలిగా మారిం దని అధిష్టానం భావిస్తోంది. ఓదార్పు యాత్రను నిలువరించేందుకు అధిష్టానం ఎంతగా ప్రయత్నించినా జగన్‌ తన దారిన తాను యాత్రకు వెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెన్‌లో రెండు శిబిరాల వాతావరణం ఏర్పడు తున్నది. దీన్ని మొగ్గ దశలోనే నివారించకపోతే ఇది వికటించి మరింత గందరగోళం నెలకొనవచ్చని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ అధిష్టానం దృష్టికి తెచ్చినట్లు తెలియవచ్చింది.

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను నేరుగా ఢిల్లీ నుంచే నిర్వహించాల్సిన సమయం ఆసన్న మైందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు డి శ్రీని వాస్‌ ఉప ఎన్నికల్లో తానే ఒక అభ్యర్ధిగా బరిలో ఉండటంతో అధిషా ్టనానికి రాష్ట్ర కాంగ్రెస్‌కు మధ్య అనుసంధానం లేకుండా పోయింది. ప్రస్తుత అవాంఛనీయ పరిణామాలకు ఇది కూడా ఒక కారణంగా అధిష్టానం భావిస్తోంది. అందుకే వీరప్ప మొయిలీ మంగళవారం స్వయంగా రంగప్రవేశం చేశారు. ఉప ఎన్నికలకు పార్టీ తరపున బరువు బాధ్యతలను పంచుతూ ఆయన పార్టీ నాయకులకుఆదేశాలిచ్చారు.

ప్రతి ఒక్కర్నీ భాగస్వాములను చేస్తూ విడివిడిగా అందరికీ స్వయంగా లేఖలు పంపారు. ముఖ్యంగా చీటికీ మాటికీ పత్రికల్లోను, చానళ్లలోనూ పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్యానాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న వారికి ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించడం అధిష్టానం కొత్త వ్యూహంలో భాగం అంటున్నారు. మంత్రులతో బాటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. వీరిలో కొందరు అధిష్టానానికి వీర విధేయులుగా ఉంటున్నట్లు రుజువు చేసుకునే ఉద్దేశంతో ప్రతి చిన్న సమస్య మీదా చానళ్ల ముందుకొచ్చి స్పందిం చడం కేంద్ర పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇదంతా సామాన్య ప్రజల దృష్టిలో క్రమశిక్షణ రాహి త్యంగా ముద్ర పడుతుందని అధిష్టానం భయపడుతోంది. అందుకే జగన్‌ ఓదార్పు యాత్ర దరిమిలా ఏర్పడ్డ రాజకీయ అయోమయం నుంచి పార్టీని కాపాడేందుకు అందరి దృష్టినీ మళ్లించే కార్యక్రమంలో అధిష్టానం పడింది.

ఉప ఎన్నికలకు ఇంకా రెండు వారాలే వ్యవధి ఉన్న నేపథ్యంలో యావత్‌ పార్టీ శ్రేణుల దృష్టి ని అటు మళ్లించే కార్యక్రమాన్ని వీరప్ప మొయిలీ చేపట్టారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను బాధ్యులను చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి మొదట్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉప ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకోదల్చుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి రోశ య్య కూడా ఒకటి రెండు సందర్భాల్లో తమకు ఒకటి వచ్చినా అదనమే అంటూ ఎన్నికలను తేలిగ్గా తీసుకుంటున్న సంకేతాలిచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులకు గట్టి వ్యాపకం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.

లేకుంటే జగన్‌ వ్యవహారంతో రాజకీయ వాతావరణమే కలుషితం అవుతున్నట్లు అధిష్టానం గుర్తించింది. అందుకే వీరప్ప మొయిలీకి ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతే కాదు. జగన్‌ సృష్టించిన రాజకీయ కల్లోలం నుంచి పార్టీ రాష్ట్ర శాఖను గట్టెక్కించే బాధ్యతను కూడా మొయిలీకే అధిష్టానం అప్పగించింది. అందులో భాగంగా ఇకపై పార్టీ నాయకులెవరూ జగన్‌ ఓదార్పు యాత్రను ఒక అంశంగా గాని ఒక వివాదంగా గాని చేయకుండా కట్టడి చేయ బోతున్నారు. జగన్‌ మీద చర్యలు తీసుకోబోతున్నారంటూ పుకార్లు లేవదీసి, ఆ వెంటనే జగన్‌ నుంచి ఆవేశపూరిత ప్రకటనలను ఆశించే కొన్ని శక్తులు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాయని వీరప్ప మొయిలీ భావిస్తున్నారు.

అలాంటి చర్యల వల్ల వాతావరణం దెబ్బతిని మరింత క్షీణించడం మినహా మరేమీ జరగదని, ఈ తరహా దుష్ట యత్నాలకు గండి కొట్టాల్సిన అవసరం ఉందని మొయిలీ అంటున్నారు. జగన్‌ వ్యవహారం అధిష్టానం చేతిలో ఉన్నందున ఇకెవరూ దాని మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడరాదంటూ మొయిలీ అలిఖిత ఆదేశాలిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న రెండు వారాల పాటు ఉప ఎన్నికల మీదనే అందరి దృష్టీ కేంద్రీకృత మయ్యేలా చేయడమే మొయిలీ తక్షణ కర్తవ్యంగా చెబుతున్నారు. ఆయన వ్యూహం ఫలించి జగన్‌ అంశం ఏ స్ధాయిలో మరుగున పడుతుందో వేచి చూడాల్సిందేనని రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి.

మొత్తం మీద రాష్ట్ర వ్యవహారాలను కేంద్ర అధిష్టానం పూర్తిగా మొయిలీకే వదిలేసినట్లు తెలుస్తోంది. సోమవారం పార్టీ అధికార ప్రతినిధులు ఎవ్వరు మాట్లాడినా వీరప్ప మొయిలీయే చూసుకుంటారంటూ సంకేతాలు పంపారు. అందుకు తగ్గట్లే మొయిలీ ఢిల్లీ వచ్చిన కొద్ది గంటల్లోనే వాతావరణంలో మార్పు కనిపించింది. తొలుత జగన్‌కు అధిష్టానం షోకాజ్‌ నోటీసు ఇవ్వబోతున్నదంటూ పుకార్లు వచ్చినా మొయిలీ వెంటనే కలగజేసుకుని వాటిని ఖండించి మరింత నష్టం జరగకుండా నివారించారు. అదే సమయంలో అటు జగన్‌ కూడా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.

దాంతో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రస్తుతం ఉభయ శిబిరాల్లోనూ కాల్పుల విరమణ లాంటి ప్రశాంత పరిస్థితి ఉన్నట్లే భావిస్తున్నారు. జగన్‌ని తన దారిన తనను వదిలేసి ఊరుకోవాలన్నది మొయిలీ అభిప్రాయంగా ఉంది. ఆయన సోమవారం ఢిల్లీ వచ్చిరాగానే ఇదే విషయాన్ని అధినేత్రి సోనియా గాంధీకి నివేదించినట్లు తెలిసింది. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయగా మొయిలీ ఇతరత్రా కాంగ్రెస్‌ శ్రేణులకు సోమవారం రాత్రికల్లా ఆ సందేశాన్ని పంపినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలయ్యేదాకా వాతావరణం విషమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధిష్టానం మొయిలీకి సూచించినట్లు తెలుస్తోంది.
జోరు తగ్గిన జగన్‌
jagna-hand తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ ఓదార్పు యాత్ర రోజు రోజుకూ జోరు తగ్గిపోతోంది. జగన్‌ పేలవమైన ప్రసం గాలు, రొటీన్‌ డైలాగులు ఆయన అనుచరులు, అభిమాను లను సైతం నిరాశకు గురిచేస్తున్నాయి. తన ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చి, తానేమిటో నిరూపించుకుని యువతలో ఉత్సాహం నింపుతారని ఆశించిన పార్టీ నేతల ఆశలు ప్రతి సభలోనూ నీరుగారి పోతున్నాయి. శ్రీకాకు ళంలో చేసిన ప్రసంగాలనే తూర్పు లోనూ వినిపిస్తుం డటంతో.. ఇప్పటికే వాటిని పత్రికలు, చానెళ్లలో చూసిన ప్రజలు జగన్‌ సభకువచ్చేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శిం చడం లేదని స్పష్టంగా కనిపించింది. ఇవన్నీ జగన్‌ జోరు తగ్గిందన్న అభిప్రాయానికి వీలు కలిగించాయి.

రెండోరోజు ఓదార్పు యాత్ర సందర్భంగా మంగళ వారం తుని, కోటనందూరు మండలాల్లోని 13 గ్రామాల్లో జగన్‌ పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన వ్యూహ బృందం సోమవారం నాటి కార్య్రమాలు పేలవంగా ముగి సిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి కొత్త పంథా అనుసరించింది. స్కూలు పిల్లలు, డ్వాక్రా మహిళ లను భారీ సంఖ్యలో తరలించింది. దానితో వారు దారి పొడవునా భారీ క్యూగా రోడ్డుకిరువైపులా నిల బడటంతో జనం బాగా వచ్చినట్లు కనిపిం చింది. ఫలితంగా నిన్నటితో పోలిస్తే నేడు సభలు కొంత కళకళలాడాయి.

ఇదే వ్యూహాన్ని జగన్‌ అనుచర బృందం అన్ని ప్రాంతాల్లోనూ అనుసరించింది. చిన్నయ్యపాలెం గ్రామంలో సంత పక్కనే ఓదా ర్పు యాత్ర ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో జనం వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. తొలిరోజు చేదు అనుభవా లను దృష్టిలో ఉంచుకుని జగన్‌ తన ప్రసంగానికి పదు ను పెడతారని భావించిన ఆయన వర్గీయు లకు ఆ ప్రసంగాల తీరు మొహం మొత్తేలా చేసింది. తరచూ చేస్తున్న అంశాలే అందులో ఉండటంతో జనం ఆయన ప్రసంగాన్ని వినేం దుకు కాకుండా, కేవలం జగన్‌ను చూసేందుకే పరిమిత మవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీలోని తన ప్రత్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణలను గట్టిగా సమాధానం ఇస్తారని భావించిన వారికి సైతం జగన్‌ మౌనం నిరాశ పరిచింది. జగన్‌ మౌనంగా ఉన్నా రంటే దాని వెనుక ఏదో సర్దుబాటు జరిగి ఉంటుందని, లేకపోతే తన తండ్రి సేవలను కూడా తప్పుపడుతున్న నేతలకు జగన్‌ సభాముఖంగా ఎందుకు జవాబు ఇవ్వరని సామాన్య జనం అభిప్రాయపడ్డారు.

యువకులు కూడా జగన్‌ తన ప్రత్యర్థులకు సభ ద్వారా గట్టి జవాబు ఇచ్చి, సవాల్‌ చేస్తారని ఆశించే సభలకు వస్తున్నట్లు వెల్లడయింది. అయితే, జగన్‌ సభలను అనుస రిస్తున్న వారికి.. ప్రతి సభలోనూ రొటీన్‌ ప్రసంగాలు వినిపి స్తుండటంతో వారంతా ఆయనను అనుసరించకుండా అక్కడితో ఆగిపోతు న్నారు. రెండోరోజు కూడా జగన్‌ సభలు, ప్రసంగాలు పేలవంగా ఉండటంతో మీడియా కూడా హడావుడి, ప్రాధాన్యం తగ్గించింది. సాయంత్రం వేళల్లో గ్రామాల్లో జనం ఒకచోట చేరతారని గ్రహించిన జగన్‌ వ్యూహ బృందం తన యాత్రను నిదానంగా, నింపాదిగా సాయంత్రం వరకూ కొనసా గిస్తున్నట్లు కనిపిస్తోంది. తుని పట్టణం లో ఈ వ్యూహం అనుసరించినందుకే జనాలు వచ్చారు.

ఇదిలా ఉండగా..జగన్‌ తన ఓదార్పు యాత్ర లక్ష్యాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి కొత్త పంథా అనుసరిస్తున్నట్లు ఆయన వర్గీయుల తాజా వ్యూహం స్పష్టం చేస్తోంది. జగన్‌ హాజరయ్యే గ్రామానికి ముందు కొంత హడావుడి వాతావరణాన్ని సృష్టించి, వాటిని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజల్లోకి పంపించే సరికొత్త ప్రచార వ్యూహానికి తెర లేపారు. అక్కడ కొందరు యువకులు, మహిళలు వేదికపె ైకి ఎక్కి, రోశయ్య సర్కారుపై ధ్వజ మెత్తడం, మధ్యలో కాబోయే సీఎం జగన్‌ జిందాబాద్‌ అన్న నినాదాలు చేయ డం, జగన్‌ కోసం ప్రాణాలర్పిస్తాం అన్న రొటీన్‌ నినాదాలు, దృశ్యాలు ఆయా సభల్లో దారిపొడవునా కనిపించాయి.

అదేవిధంగా, స్థానిక కాంగ్రెస్‌ నేతలే స్థానిక గ్రామ మహి ళలు, యువకులను ఇంటర్వ్యూలు చేయడం, వారంతా రోశయ్య ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం, జగనన్నను సీఎం చేసే వరకూ విశ్రమించమని శపథాలు చేయటం, అవి జగన్‌ అనుకూల చానెళ్లలో ప్రత్యక్ష ప్రసా రాలు కావ డం ఫార్సుగా మారాయి. వీటిని నిశితంగా పరిశీలిస్తే.. ఒక పథకం ప్రకారం జగన్‌ను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారని స్పష్టమవుతోంది. మరోవైపు.. అందుకు తగినట్లుగానే రోశ య్య ప్రభు త్వంపై వివిధ గ్రామాల్లోని బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయనను వైఎస్‌తో పోల్చుకోలేకపోతున్నామని, ఆయన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని వారు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయ డం ప్రస్తానార్హం.

అన్ని సంక్షేమ పథకాలనూ రోశయ్య ప్రభుత్వం తొలగించి వేస్తోందని, ఆయన మానవత్వంతో కాకుండా అన్నీ ‘లెక్కలతో పరిపాలన’ చేస్తున్నారని మహిళలు పెద్ద సంఖ్యలో అసహనం వ్యక్తం చేస్తుండటం ‘సూర్య’ పరిశీలనలో కనిపించింది. ‘ఆ బాబు బతికుంటే మా పింఛన్లు తప్పనిసరిగా ఆగకుండా వస్తాయన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం లేకుం డా పోయింది. ఆఫీసుకు వెళితే మా ముసలోళ్లను పట్టిం చుకునే దిక్కు లేదు. ఈ అబ్బాయికి (జగన్‌) పిల్లలు ఉన్నా రా? ఉంటే ఆ బాబు చల్లగా ఉండాలి. మా లాంటి పేదవాళ్ల కు రెండొందలు పించన్లు ఇచ్చిన వాళ్ల నాయన ఆశీస్సులు, మా ఆశీస్సులు అబ్బాయికి ఉంటాయ’ని 90 ఏళ్ల వృద్ధురా లొకరు ‘సూర్య’ ప్రతినిధి వద్ద వ్యాఖ్యాచింది.

రోశయ్యను తాము సీఎంగా లెక్కలోకి తీసుకోవడం లేదని, పేదవారికి అమలు చేసిన పథకాలన్నీ రోశయ్య తొలగిస్తున్నారని, తమ గ్రామాల్లో లెక్కలేనన్ని తెల్లకా ర్డులను ఈ ప్రభుత్వం తొలగించిందని మహిళలు మండి పడటం కనిపించింది. నేరుగా ఎన్నికయితే ప్రజల కష్టాలు తెలుస్తాయని మరికొందరు చదువుకున్న మహిళలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వైఎస్‌ పథకాలను కొనసాగించడం రోశ య్యతో సాధ్యం కాదని, జగన్‌ వల్లే అది సాధ్యమని మహిళలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరికొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎంపీటీసీ స్థాయి నేతలు వైఎస్‌కు రోశయ్య ద్రోహం చేస్తున్నారని, ఆయన దయతో సీఎం అయిన రోశయ్య.. జగన్‌ ఎవరని ప్రశ్నించటం విశ్వాసఘాతుకమేనని ధ్వజమెత్తారు. జగన్‌ సీఎం కావడం ఖాయమన్నారు. జగన్‌ హాజరయ్యే మరికొన్ని సభల్లో.. వైఎస్‌ ఆత్మ ముఖ్యమంత్రి రోశయ్యను తూర్పారపడుతున్నట్లు మిమిక్రీల ద్వారా వినిపించారు.