కడప నియోజకవర్గం ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రపై మరోసారి కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఓదార్పుయాత్ర జగన్ వ్యక్తిగతమని, పార్టీ నేతలు ఎవరూ ఆ యాత్రలో పాల్గొనవద్దని అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అనుచరులతో జగన్ భేటీ...
వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి ఈరోజు ముఖ్య అనుచరులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ రెండున తిరుపతిలో జరిగే వై.ఎస్. రాజశేఖర్‌రె డ్డి వర్ధంతి పోస్టర్లను జగన్ విడుదల చేశారు. కాంగ్రెస్ నేత టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ జనహృదయ నేత వైఎస్‌కు తిరుపతిలో చాలా మంది అభిమానులు ఉన్నారన్నారు.
ఈ సంస్మరణ సభలో 25వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. అలాగే పలు కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. కొండా సురేఖ, అంబటి రాంబాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు : బాలినేని
కడప నియోజకవర్గం ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ మూడు నుంచి ప్రకాశం జిల్లాలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర యధాతథంగా జరుగుతుందని అన్నారు. ఈ యాత్రంలో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. యాత్ర కోసం తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు మంత్రి బాలినేని పేర్కొన్నారు.

No comments:
Post a Comment