పులివెందుల్లో నేను మీ అందరి మధ్యనే పెరిగినోణ్ని ... మీ అందరి మధ్యనే తిరిగినోణ్ని... మీ ఆప్యా యత వల్లే చిరునవ్వుతో మీ ముందుకు వచ్చానని ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ జగన్ సోమవారం పులివెందుల నియోజక వర్గంలో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ముందుగా ఆయన ఇడుపులపాయ నుండి పులివెం దులకు చేరుకుని ఓ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అనంతరం కడప రహదారిలోని రింగు రోడ్డు కూడలిలోను, బస్టాండ్ సర్కిల్ సమీపంలోను, పార్నపల్లె రహదారి సమీపంలోని రింగు రోడ్డు సర్కిళ్ల్ల వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరిం చారు.
ఈ సందర్బంగా మాట్లా డుతూ పులివెందుల పట్టణానికి నలువైపులా నాన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా రాష్ట్రంలో ఎన్నో జిల్లాల్లో తిరిగినా. కానీ ఇక్కడ మీరు చూపుతున్న ప్రేమ , అభిమానం, ఆప్యాయతలే నన్ను మీ ముందుకు చిరునవ్వుతో నిలిపాయన్నారు. మీ ఆప్యాయతకు, ఆదరాభిమానాలకు చేతులెత్తి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అందించిన ప్రేమానురాగాలను నాపై కూడా చూపించాలని అభ్యర్థిస్తున్నానన్నారు.
గత 9 నెలలుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరికీ తెలుసు ను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పత్రికల్లో , టీవీల్లో చూస్తున్నారన్నారు. పట్టణ శివార్లలో విగ్రహాల ఏర్పాటుకు ఇంత మంది ఏకమయ్యారంటే వైయస్ ఎక్కడు న్నారనే ప్రశ్నకు ప్రతి గుండెలో వైయస్ ఉన్నారన్నారు. ఇక్కడి వారి అందరి గుండె లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకోవడం లేదని, ప్రతి గుండె వైయస్సార్ వైయస్సార్ అంటూ కొట్టుకుంటోందన్నారు.
అనంతరం జగన్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నల్లపు రెడ్డిపల్లె మీదుగా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. నల్లపు రెడ్డిపల్లెలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నల్లగొండు వారిపల్లె మీదుగా వెళుతున్న జగన్ కాన్వాయ్‌ను ఆపి జగన్‌కు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయనకు ఆ గ్రామస్థులు సమస్యలను విన్నవించారు. అనంతరం అంబక పల్లె గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలన్నీ జగన్ ఓర్పుతో విన్నారు. అనంతరం మురారిచింతల , దిగువపల్లె, ఎగువ పల్లె, పార్నపల్లె తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు.

జగన్ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు
ఓదార్పు యాత్రలో కడప జిల్లా రాజంపేట, రాయచోటి, బద్వేల్, రైల్వే కోడూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కమలమ్మ, కొరముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డిలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన గురునాథ రెడ్డిలు పాల్గొన్నారు.
వీరితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రఫ్ కూడా జగన్‌ను కలిసి వెళ్లారు. తాను రాజమండ్రికి వెళ్తున్నానని జగన్‌కు ముందే చెప్పానని.. ఆయన ఆమోదం పొందానని.. మంగళవారం నుంచి ఓదార్పులో పాల్గొంటానని మంత్రి అహ్మదుల్లా ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రిగా ముఖ్యమంత్రి అనుమతిని తీసుకుంటారా.. లేక.. జిల్లా ఎంపీ ఆమోదం పొందుతారా? అనే సందేహం పార్టీలో నెలకొంది.
ప్రకాశం జిల్లా పర్యటన గురించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన ముఖ్యమంత్రి రోశయ్య.. ఇప్పుడు అహ్మదుల్లాతోనూ మాట్లాడతారా అనేది అసక్తికరంగా మారింది. జడ్పీ చైర్మన్ జ్యోతిరెడ్డి, డీసీసీబీ చైౖర్మన్ పల్లం బ్రహ్మానంద రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు, పులివెందుల మునిసిపల్ చైర్‌పర్సన్ రుక్మిణిలు కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఆయన జగన్ కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిలు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.
జగన్ బాబాయి.. ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి మొదటి రోజు ఓదార్పు యాత్రలో కనిపించలేదు. ఇటీవల సోనియాకు రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది. అయితే.. అమెరికాలో కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నందున ఆ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వెళుతున్నానని ముందు రోజే వివేకా చెప్పారు. జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యులు డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలు ఓదార్పునకు దూరంగా ఉన్నారు. కోస్తాతో పోలిస్తే సొంత జిల్లాలో ఓదార్పునకు అంతస్థాయిలో జన స్పందన కనిపించలేదు.
నలుగురికి ఓదార్పు
మొదటి రోజు నాలుగు కుటుంబాలను జగన్ ఓదార్చారు. పులివెందుల్లో దేరంగుల జయరామ్ అనే వ్యక్తి వైఎస్ మృతి చెందిన ఆరు రోజుల తర్వాత చనిపోయారు. అలాగే అంబకపల్లెలో లోమడ వెంగముని అనే వృద్ధ్దుడు వారం తర్వాత చనిపోయాడు. ఈ ఇద్దరి కుటుంబాలను జగన్ పరామర్శించారు. అలాగే దిగువ పల్లెలో చాపల వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబాన్ని, పార్నపల్లెలో మృతి చెందిన అంకె పుల్లన్న అనే వ్యక్తి కుటుంబాలను కూడా జగన్ ఓదార్చారు. వీరితోపాటు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మరో నలుగురి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు.
ఓపిగ్గా, ఓర్పుగా సాగిన ఓదార్పు
పులివెందులలో జగన్ ఓదార్పు యాత్ర ఓర్పుగా, ఓపిగ్గా సాగింది. ఉదయం 8.30 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒకటిన్నరకు పూర్తి కావాల్సి ఉండగా 10.30 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకు కూడా పార్నపల్లెకు చేరుకోలేక పోయారు. ఆలస్యం కావడంతో వేముల ఓదార్పును రద్దు చేసుకున్నారు. మార్గమధ్యంలో వివిధ గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
పెద్దకుడాలలో జిలిటెన్‌స్టిక్స్ లభ్యం
ఓదార్పు యాత్రకు ముందుగా లింగాల మండలం పెద్దకుడాలలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా పెద్దకుడాలలో వైఎస్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దీనికి కొన్ని గంటల ముందే విగ్రహం ఏర్పాటు చేసిన సమీప ప్రాంతంలో 52 జిలిటెన్‌స్టిక్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఏఎస్పీ కార్తికేయన్ పరిశీలించారు. పలు కోణాల్లో వీటిపై పరిశీలన చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment