తన వ్యతిరేక వర్గంపై యువనేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఎంతకాలం బతికామన్నది కాదు... ఎలా బతికామన్నది ముఖ్యమని, ఓదార్పుయాత్ర చేస్తానని ప్రకటించిన రోజు ఏ రాజకీయాలు లేవని, ఇపుడు దాన్ని వైఎస్‌ఆర్ వ్యతిరేకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున ఓదార్పుయాత్ర ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ చేసిందేమీ లేదని ఆయన వ్యతిరేకులు ఇపుడు ఏదేదో మాట్లాడి అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాకినాడ నేతాజీ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓదార్పు యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కేవలం 10 నిమిషాలే మాట్లాడినా తన నాన్న వైఎస్ చేసిన మంచి పనుల గురించి చెబుతూనే తన వ్యతిరేకులపై నిప్పులు చెరిగారు. జగన్ రాక సందర్బంగా నేతాజీ పార్క్ జనసంద్రమైంది. ఈ సభతో జగన్‌పై అభిమానం ఉప్పెనలా పొంగిందనే చెప్పాలి. పేలబోయే అగ్నిపర్వతం ముందు కనిపించే ప్రశాంతత.. లావా ఎప్పుడు ఎగజిమ్ముతుందో తెలియని స్థితిలో కనిపించే వేడి.. గుండెల్లో రగులుతున్న బడబాగ్ని.. తనకు, తన అనుచరులకు జరుగుతున్న అన్యాయంపై గుండెమంట..ప్రత్యర్థులపై విరుచు కుపడే పదునయిన పదజాలం.. త్వరలో ఏదో జరగబోతోందన్న సంకేతాలు. ఇవీ.. ఓదార్పు యాత్రికుడు, కడప ఎంపి వైఎస్ జగన్ గురువారం కాకినాడలో చేసిన ప్రసంగంలో కనిపించిన భావాలు.
18 రోజులపాటు తూర్పు గోదావరిలో ఓదార్పు యాత్ర నిర్వహించి, గురువారం కాకినాడలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికపై జగన్ ఆచితూచి, వ్యూహాత్మకంగా ప్రసంగించారు. మనసులో ప్రత్యర్థులు ఎక్కడికక్కడ తనకు బ్రేకులు వేస్తున్నారన్న ఆగ్రహాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూనే, అక్కడక్కడా తన అసంతృప్తిని ఎక్కడా తొట్రుపాటు లేకుండానే బహిర్గతం చేశారు.
తన తండ్రి వైఎస్ మృతి చెందిన వార్తను తట్టుకోలేక మృతి చెందిన వారంతా కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? వారి కష్ట సుఖాలు తెలుసుకుని ఆర్థిక సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని సూటిగా ప్రశ్నించినప్పటికీ.. ఎక్కడా రోశయ్య ప్రభుత్వాన్నిప్రస్తావించకుండా వ్యూహాత్మకంగానే విమ ర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీని అధికా రంలోకి తెచ్చేందుకు కష్టపడ్డ కార్యకర్తలు తమ ప్రియతమ నేత చనిపోతే వారిని రోశ య్య సర్కారు పట్టించుకోవడం లేదని, తాను పరామర్శించేందుకు వస్తుంటే అడ్డుపడుతున్నారని చెప్పకనే చెప్పినట్లు కనిపించింది. తనను నమ్ముకున్న వారి కోసం పోరాడతారనే పేరున్న రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని జగన్ కూడా కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.
తనకు మద్దతు గా నిలిచిన ఎమ్మెల్యే కొండా సురేఖ, అంబటి రాంబాబుకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరికీ న్యాయం చేయలేకపోయానన్న బాధ ఉందని చెప్పడం ద్వారా, తండ్రి మాదిరిగానే. తన కోసం నిలిచిన వారి పక్షాన పోరాడ తానన్న సంకేతాలు పంపించారు. జగన్ తన ప్రసంగంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురించి కానీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గానీ ప్రస్తావించకపోవడం బట్టి. తనకు జనం, అనుచరులే ముఖ్యమని పరోక్షంగా స్పష్టం చేశారు.
ప్రసంగం ఆసాంతం తన తండ్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి పేద ప్రజల కోసం చేపట్టిన కిలో రెండు రూపాయ ల బియ్యం పథకం, విద్యార్థులకు ఫీజుల రీ ఇంబర్స్‌మెంట్, మహిళలకు పావలా వడ్డీ వంటి పథకాలు ఏ ముఖ్యమంత్రి ఇచ్చారని నిలదీయడం ద్వారా.. ఒక్క వైఎస్ మాత్రమే పేదల కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి అని విస్పష్టంగా ప్రకటిం చారు. సొంత పార్టీలో పెరుగుతున్న విమర్శల దాడులు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు జగన్ అంతరంగం ఆగ్రహంతో ఉడికిస్తు న్నాయని ఆయన ప్రసంగం చెప్పకనే చెప్పింది.
అధిష్ఠానం సహా ముఖ్యమంత్రి తనను అణచివేసేందుకు చేస్తున్న ప్రయ త్నాలపై అంతరంగం మండుతున్నా, దానిని సైతం అణచు కుని, లౌక్యంగా, వ్యూహాత్మకంగా మాట్లాడటం అందరినీ ఆక ర్షించింది. మనసులో గూడుకట్టుకున్న ఆగ్రహాన్ని, తనపై జరుగుతున్న అణచివేత వైఖరిని పెదవి చాటున ఓర్పుగా భరిస్తున్నప్పటికీ, ఆ సహనం ఎంతకాలం ఉంటుం దో చెప్ప లేని అయోమయంలో జగన్ ఉన్నట్లు ఆయన మాట ల ధోర ణి స్పష్టం చేసింది. ‘ఈ సహనం ఇంకా ఎంతకాలం ఉంటుం దో చెప్పలేను కానీ’ అంటూ తన మనసులో రగులు తున్న భావాలను బయట పెట్టకుండా దానికి వ్యూహాత్మకంగా అస్ప ష్ట ముగింపు ఇచ్చారు. త్వరలో ఏదో జరుగబోతోందన్న ఉత్కంఠతో పాటు.. అధిష్ఠానానికి ‘తాను ఖాళీగా కూర్చోనన్న’ సంకేతాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. జనం తన వెంటే ఉన్నారని, 30 మంది ఎమ్మెల్యేలు తనకు దన్నుగా ఉన్నారన్న విషయం జగన్ ప్రసంగంలో ప్రతిధ్వనించింది.
ఈ సహనం ఎంతకాలమో... !
‘ఈ సహనం ఎంతకాలం ఉంటుందో తెలీదు. నా సహనానికి సమయం చెప్పలేను’ అని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. నాన్నగారు పోతూపోతూ తనను ఒంటరిని చేయలేదని, ఇంత పెద్ద కుటుంబాన్ని, అక్కల్ని, చెల్లెళ్లను, అన్నయ్యల్ని ఇచ్చారని ఆర్ద్రంగా అన్నారు. ‘ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. నాన్నగారు పోయిన తర్వాత ఆ బాధలో కూడా చిరునవ్వుతో ఉన్నానంటే అందుకు మీ ఆప్యాయత, ఆదరాభిమానాలే కారణం’ అని జగన్ ప్రజలకు కృత జ్ఞతలు తెలిపారు. గురువారం రాత్రి కాకినాడలో నేతాజీ పార్కులో తన ఓదార్పు యాత్రకు వచ్చిన అశేష ప్రజానీ కాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
సభకు వచ్చిన ప్రజానీకాన్ని చూసి ఉత్సాహం ఉప్పొంగగా -‘మొత్తం కాకినాడ అంతా ఇక్కడే ఒక్కచోటే ఉందా అనిపిస్తోంది. మీ ఆప్యాయతానురాగాల్ని చూస్తు న్నాను. వైఎస్ పట్ల మీ గుండెల్లో ఉన్న అభిమానపు గుండె చప్పుళ్లు వినిపిస్తున్నా యని’ ఉద్వేగంగా అన్నారు. తన తండ్రి మరణించిన తర్వాత ఆయనపై ఉన్న ప్రేమతో, అభిమానం తో కొందరు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబా లను ఓదార్చ డం ఆయన కుమారుడిగా తన కనీస ధర్మమ ని జగన్ చెప్పారు. అయితే, తన ఓదార్పు యాత్రకు కూడా ఎందరో ఎన్నో ఆటంకాలు కల్పించారనీ, కానీ ఎవరేమన్నా చేయాల్సింది చేసితీరతానని కడప ఎంపీ స్పష్టం చేశారు.
అంబటి, సరేఖలకు అన్యాయం చేశారు...
‘నన్నే నమ్ముకుని, నా వెంటే ఉన్న కొండా సురేఖకు, అంబటి రాంబాబుకు అన్యాయం జరిగింది. ఎవరు అన్యాయం చేసినా వారు నా గుండెల్లో ఎప్పటికీ ఉంటారు’ అని జగన్ వారిపట్ల అభిమానాన్ని ప్రదర్శించారు.ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానని తెలిపి, ఓదార్పు యాత్రకు ఎలా ప్రేరణ కలిగిందీ ఆయన వివరించారు. గత ఏడాది సెప్టెంబర్ 2న నాన్నగారు చనిపోతే, సెప్టెంబర్ 25న ఆయన చనిపోయిన పావురాల గుట్టలో సంతాపసభ జరిగింది. నాన్నగారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారున్నారు.
వారి కుటుంబాలను ఓదార్చడానికి వస్తానని ఆనాడే...నాన్నగారు చనిపోయిన చోటే వాగ్దానం చేశాను. ఈ ప్రాంతంలో ఇంతవరకు నాలుగు జిల్లాలు తిరిగాను’ అని వైఎస్ తనయుడు చెప్పారు. రాజశేఖరరెడ్డి ప్రజలకోసం చేపట్టిన పథకాల గురించి చెబుతూ- ‘ఇంతవరకూ ఏ ఒక్క సిఎం అయినా వైఎస్‌లా పేదలకు మంచి వైద్యం అందించాలన్న ఆలోచన చేశారా?పావలా వడ్డీ పథకంతో లక్షలాదిమంది మహిళల్ని లక్షాధికారుల్ని చేయాలని ఎవరైనా ఏ ప్రభుత్వమన్నా సంకల్పించిందా? దేశంలో ఎవరైనా 26 లక్షల మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం కల్పించా రా? ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించా రా?’ అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ చేసింది వైఎస్‌నే నని ఆయన ప్రస్తుతించారు. జలయజ్ఞాన్ని చేపట్టి లక్షా 80 వేల కోట్లతో ప్రతి ఎకరాకు సాగునీరందించాలని ఎవరైనా సంకల్పించారా? అని అడిగారు. ప్రతి ఎకరాకు లక్షా 80 వేల రూపాయలు ఇచ్చినట్టే కాదా అన్నారు.
మానవత్వంతో, నిండు గుండెతో...
అంతకు మందు మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ జగన్‌ను చూసిన ప్రతివారూ, ప్రతి చోటా నాన్నగారి పేరు నిలబెట్టు బాబూ అని కోరారు. వారి అభిమానం మమ్మల్ని కదిలించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణిస్తే ఆ బాధను తట్టుకోలేక 750 మంది చనిపోయా రు. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అది చూసి మానవత్వంతో, నిండు హృదయంతో జగన్ వారి కుటుం బాల్ని ఓదార్చేందుకు వచ్చారు’ అని పేర్కొన్నారు. వర్షంలో నూ వేలాది మంది ప్రజలు సమావేశానికి హాజరయ్యారు.
సర్కారు సంగతేమిటి?
జగన్ వేరుకుంపటి పెడితే రోశయ్య ప్రభుత్వం పరిస్థితి?
బతుకుతుందా? కూలుతుందా?
మధ్యంతరం వస్తుందా?
రాష్ట్రపతి పాలన తెస్తుందా?
భవిష్యత్తు రాజకీయంపై ఆసక్తికర చర్చ
మధ్యంతరం వస్తుందా?
రాష్ట్రపతి పాలన తెస్తుందా?
భవిష్యత్తు రాజకీయంపై ఆసక్తికర చర్చ
'సహనం నశిస్తున్నది' అంటున్న కడప ఎంపీ జగన్ వేరు కుంపటి పెట్టుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? బొటాబొటి మెజారిటీతో నెట్టుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏమిటి? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వారసుడిగా తెరపైకి రాబోతున్న జగన్ వెంట వెళ్లేది ఎందరు? కురు వృద్ధుడైన ముఖ్యమంత్రి రోశయ్యకు, హై కమాండ్‌కు అండగా ఉండేది ఎవరు?
మధ్యంతరం వస్తుందా? రాష్ట్రపతి పాలనతో ఆగుతుందా? అసలు... సర్కారు కుప్పకూలుతుందా? ఆపత్కాల 'సహచరుల' అండతో నిలబడుతుందా? ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ! ఎన్నో సమీకరణాలు, మరెన్నో సంభావ్యతలు!
రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 294. స్పీకర్‌ను మినహాయిస్తే, ప్రభుత్వ మనుగడకు (కనీస మెజారిటీ) 147 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 156! అంటే మేజిక్ ఫిగర్ కంటే కేవలం 9 మంది మాత్రమే ఎక్కువ అన్న మాట! ఈ అత్తెసరు పరిస్థితే భవిష్యత్తు రాజకీయాన్ని అత్యంత ఆసక్తికరంగా మారుస్తోంది. ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేపుతోంది.
ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న జగన్ , వేరుకుంపటి పెట్టుకోవడం అంటూ జరిగితే, తక్షణం రోశయ్య ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఏకైక కార్యక్రమంగా పావులు కదుపుతారనడంలో ఎవరికీ సందేహాలు లేవు. ఎందుకంటే రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగేళ్ల సమయం ఉంది. అప్పటిదాకా వేచిచూసే ఉద్దేశమే ఉంటే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగేవారు.
రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటే తప్ప జగన్ వెంటనే సీఎం కావడం సాధ్యం కాదు. అది ఎలాగూ జరిగే పని కాదు కనుక, వెంటనే ప్రభుత్వాన్ని పడగొట్టి, మధ్యంతర ఎన్నికలను తెచ్చి, లక్ష్య సాధనకు ప్రయత్నించడమే జగన్ వ్యూహంగా భావించవచ్చు.
అయితే ప్రభుత్వాన్ని ఆయన పడగొట్టగలరా? మామూలుగానైతే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జగన్ తన వైపునకు తిప్పుకోగలిగితే ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం... ముగ్గురు ఇండిపెండెంట్లు, ఏడుగురు మజ్లిస్ సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు.
ఇక 18 మంది సభ్యులున్న ప్రజారాజ్యానికి కూడా అధిష్ఠానం 'ముందు జాగ్రత్త'గా స్నేహహస్తం అందించి ఉంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి కనీసం 38 మందిని చీల్చగలిగితేనే రోశయ్య ప్రభుత్వాన్ని జగన్ మైనారిటీలో పడేయగలరు. ఈ క్రమంలోనూ ఇరువైపులా మళ్లీ అనేక ప్రశ్నలు, ప్రతిబంధకాలు. అవేమిటంటే....
ముగ్గురు స్వతంత్రులూ వైఎస్ హయాంలో కాంగ్రెస్ అనుబంధ సభ్యులుగా మారారు. వారిప్పుడూ కాంగ్రెస్ వైపే ఉంటారా? జగన్ వైపు తిరుగుతారా? స్వతంత్రులు ప్రభుత్వంవైపే ఉండడం సాధారణంగా కనిపించే పరిణామం. ఇక 18 మంది పీఆర్పీ ఎమ్మెల్యేల్లో కనీసం ఐదుగురు వైఎస్ కుటుంబానికి సన్నిహితులు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వారు సర్కారుకు మద్దతిస్తారా?
కాకినాడలో గురువారం జగన్ నిర్వహించిన సభకు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సోనియా ఆమోదం లేకపోయినప్పటికీ, ఎందరు ఎమ్మెల్యేలు జగన్ వద్దకు వెళ్లడం కీలకమేనని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ను కాదని జగన్ ముందుకు నడిస్తే, ఆ పక్కకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే అంచనాలున్నాయి.
కాకినాడ సభకు వెళ్లిన వారిలో చాలామంది, 'ప్రజాదరణ కలిగిన' జగన్‌కు నైతిక మద్దతు మాత్రమే ఇస్తున్నారని, కాంగ్రెస్‌లోనే కొనసాగాల్సిందిగా ఆయనను కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎక్కువమంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారే కావడం, పదవీ కాలం మరో మూడున్నరేళ్లు ఉండడం నేపథ్యంలో, జగన్ కోసం పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి, 'అధికారాన్ని' కోల్పోవడానికి, మళ్లీ ఎన్నికల బరిలో నిలబడడానికి వీరందరు సిద్ధపడతారా? పార్టీయే ముఖ్యమని వెనుదిరుగుతారా?
కాంగ్రెస్‌వాదిగా ఉంటేనే తమ మద్దతు లభిస్తుందని జగన్‌కు చెప్పాల్సిందిగా ఇటీవల కొందరు మంత్రులు యువ ఎమ్మెల్యేలకు కౌన్సెలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కొందరు ఎమ్మెల్యేలు కాకినాడకు వెళ్లారని ప్రచారం కూడా జరుగుతోంది. అక్కడికి వెళ్లిన వారందరూ వేదికపై కనిపించకపోవడంపై కూడా పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎక్కువ మంది మాట్లాడేందుకు అవకాశం లేదని, అలాంటివారు కింద కూర్చోవాలని, లేదా వెళ్లేవారు వెళ్లిపోవచ్చని కూడా అక్కడ చెప్పారని దీంతో కొందరు మీటింగ్‌కు ముందే వచ్చేశారనే చర్చ కూడా ఉంది. మరోవైపు బహిరంగ సభకు హాజరు కానప్పటికీ జగన్‌కు మద్దతుగా నిలిచే వారు కాంగ్రెస్ శాసనసభా పక్షంలో ఇంకొందరు ఉన్నారు. వీరందరి సంఖ్యా కనీసం 38ని దాటుతుందా?
ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే, నలుగురు సభ్యుల సీపీఐ, ఒక్కొక్క సభ్యుడున్న సీపీఎం, బీజేపీ, లోక్‌సత్తా ఎలాంటి వైఖరి తీసుకుంటాయి? కొత్తగా ఎన్నిక కాబోతున్న టీఆర్ఎస్ సభ్యులు ఏం చేస్తారు? జగన్ వేరు కుంపటి పెట్టుకుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్‌తో కలుస్తుందన్న ప్రచారం సాగుతోందని టీఎన్జీవో నేత స్వామిగౌడ్ గురువారం కేసీఆర్ సమక్షంలోనే చెప్పారు.
'సోనియాకు నామీద అభిమానం ఉంది. ఆమె నాతో ఫోన్ చేసి మాట్లాడుతుంది అనేవి నిజమే కానీ అంటూనే టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో కలిసే అవకాశం లేదని పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. ఇక 91 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఏం చేస్తుందన్నది మరో కీలక ప్రశ్న.
తప్పనిసరై సభలో అవిశ్వాసం వస్తే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు కూడా రోశయ్య సర్కారు పడిపోకుండా సహకరిస్తారని, సభకు గైర్హాజరు అవుతారనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ మనుగడకు పరోక్షంగానైనా సహకరించాలని ఆయా పార్టీలుగానీ, వాటికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు గానీ నిర్ణయించుకుంటే, ఆ పరిస్థితిలోనూ సర్కాను పడగొట్టేంత బలాన్ని జగన్ సంపాదించుకోగలరా?
ఈ కీలక ప్రశ్నలకు సమాధానాలు రావడం అంత సులభం కాదు. జగన్ నుంచి ప్రమాదం అంచనా వేసినందునే అధిష్ఠానం చిరంజీవితో చర్చలు జరిపి ముందస్తు మద్దతు స్వీకరించిందని, మజ్లిస్ కూడా కాంగ్రెస్‌కు తోడ్పాటునందిస్తుందని.. అందువల్ల రోశయ్య ప్రభుత్వానికి ప్రమాదమేమీ ఉండదని ఢిల్లీ నేతలు ధీమాగా ఉన్నట్టు వారు చెబుతున్నారు.
"ఏడాదిన్నర కూడా కాకుండానే ఇప్పటికిప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరు. ఒకవేళ ఉన్నారనుకున్నా, రోశయ్య సర్కారును పడగొట్టిన వెంటనే ఎన్నికలు వస్తాయన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించవచ్చు.
ఒకసారి రాష్ట్రం ప్రస్తుత గవర్నర్ పాలనలోకి వెళితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రాభవం పోగొట్టుకోక తప్పదు. చేజేతులా అధికారాన్ని కోల్పోయి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లా గోళ్లు గిల్లుకోవాల్సి ఉంటుంది'' అని పార్టీ నేత ఒకరు విశ్లేషించారు.
కాంగ్రెస్‌ను కాదంటే జగన్‌కు బలం పెద్దగా ఉండదని లెక్కలు వేస్తూనే అధిష్ఠానం ఇతర ఆలోచనలు కూడా చేస్తున్నది. వెంటనే ఎన్నికలకు సంసిద్ధంగా లేని ఇతర పక్షాలతో, సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదింప జేసినట్లయితే, తర్వాత ఆరు నెలల దాకా బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరమే ఉండదని అది భావిస్తోంది.
జగన్ సొంత పార్టీ పెట్టుకుంటే, ఆయనతో జత కూడిన ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించి, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించడం మరో మార్గమని, మళ్లీ విశ్వాసం నిరూపించుకోవాల్సిన గడువులోగా వారు పదవులు కోల్పోతారని పార్టీ ముఖ్యులు లెక్క వేస్తున్నారు.
ఏదిఏమైనా ఈ రాజకీయాలు కాంగ్రెస్‌ను గందరగోళంలో పడేయడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 2న సీఎం రోశయ్య ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర రాజకీయాలపై అధిష్ఠానంతో ఆయన చర్చించే అవకాశం ఉంది.