జోరుగా సాగుతున్న జగన్‌యాత్ర
కోనసీమలో రెండు రోజులుగా ఉత్సాహభరితంగా కొనసాగుతున్న జగన్‌యాత్ర శుక్రవారం నాటికి మూడవరోజుకు చేరుకుంది. అర్థరాత్రి దాటుతున్న జగన్ రాకకోసం గంటల తరబడి వర్షపు చినుకులలో తడిసి ముద్దవుతూ అభిమానులు నిరీక్షించారు. వారి నిరీక్షణలకు తగ్గట్టుగానే జగన్ విశ్రాంతి తీసుకోకుండా అర్థరాత్రి దాటుతున్నా సరే అభిమానులు నిరుత్సాహానికి గురికాకుండా పలు గ్రామాలలో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆవిష్కరించారు. పలు గ్రామాలలో ముత్తయిదువులు మంగళహరతులతో స్వాగతం పలికారు. మరికొందరు జగన్ అన్నా అంటూ చేతికి రక్షాబంధన్‌లు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. అక్కడక్కడా కొన్ని గ్రామాలలో జనం పలచగా కనబడినప్పటికీ మండల ముఖ్యకేంద్రాలలో జగన్‌కు అపూర్వ ఘనస్వాగతం లభించింది. తమ అభిమాన నాయకుడు స్వర్గీయ వైఎస్ ముద్దుబిడ్డ జగన్‌ను చూడడానికి జనం ఎగబడ్డారు.
ఆయనతో కరచాలనం చేయడానికి వయోబేధం లేకుండా అభిమానులు పోటీపడ్డారు. గురువారం రాత్రి 11 గంటలకు గన్నవరం మండలం గంటిపెదపూడిలో ప్రవేశించి అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బెల్లంపూడి చేరుకుని వైఎస్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన పెనుమాల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి, రాత్రి 2 గంటలకు గన్నవరం సెంటర్‌కు చేరుకున్నారు. సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, డొక్కా సీతమ్మ వారథి వద్ద అభిమానులు ఏర్పాటుచేసిన స్వర్గీయ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించే సమయం తెల్లవారు జాము 3గంటలు కావడంతో జనం అంతగా లేకపోవడంతో నిరుత్సాహంగా ప్రసంగించకుండానే రాజోలు మండలం దిండి చేరుకుని రిసార్ట్సులో బసచేసారు. శుక్రవారం ఉదయం జడ్పీచైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్వగృహంలో అల్పాహారవిందు ఆరగించిన అనంతరం రాజోలు, తాటిపాకలలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి, అభిమానులనుద్ధేశించి ప్రసంగించారు.
గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి స్వగ్రామం వేగివారిపాలెం చేరుకుని అక్కడ ఆమె ఇంట కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. లక్కవరంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి అభిమానులనుద్ధేశించి ప్రసంగించారు. అదే గ్రామంలో పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు జగన్‌కు టాటా చెబుతూ ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంకు చెందిన సోమన దీప్తికళ కుటుంబాన్ని, వీవీమెరకకు చెందిన గుండాబత్తుల స్వామినాయుడు కుటుంబాలను పరామర్శించి నేనున్నానంటూ ధైర్యం చెప్పారు.
అదే గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, వైఎస్‌కొడుకుగా పుట్టడం తన అదృష్టమని అభిమానులనుద్ధేశించి మాట్లాడారు. అనంతరం సఖినేటిపల్లి మండలం మోరి, శృంగవరప్పాడు, కేశవదాసుపాలెం, అంతర్వేది, గొంది, గుడిమెల్లంక గ్రామాలలో పర్యటించి వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. వైఎస్ మృతి జీర్ణించుకోలేక మృతిచెందిన గుడిమెల్లంక గ్రామస్తుడు మామిడిశెట్టి సత్యనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం దిండి చేరుకుని అక్కడ రిసార్ట్సులో బస చేసారు. శుక్రవారం రాత్రికి జగన్ తల్లి స్వర్గీయ వైఎస్ సతీమణి విజయలక్ష్మి, సీనియర్ నాయకులు చేగొండి హరిరామజోగయ్యలు జగన్‌ను కలసి పలు విషయాలు చర్చించనున్నారు.
శనివారం ఉదయం గన్నవరం చేరుకుని అక్కడ అభిమానులనుద్ధేశించి ప్రసంగించి కె.ఏనుగుపల్లిలో వైఎస్ మృతిని జీర్ణించుకోలేక అసువులు బాసిన అభిమాని కుటుంబాన్ని పరామర్శించి వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి అమలాపురం చేరుకుని ఓదార్పుయాత్ర కొనసాగిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. మంత్రి విశ్వరూప్ ప్రత్యక్షంగా జగన్‌యాత్రలో పాల్గొనకపోయినప్పటికీ కుమారుడు కృష్ణారెడ్డి ద్వారా జగన్‌యాత్రను సక్సెస్ చేయాలని మైకులద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పినిపే కృష్ణారెడ్డి యువజనసేన పేరుతో ఫ్లెక్స్‌బోర్డులతో, వాహనాలతో జగన్‌యాత్రకు అధికసంఖ్యలో అభిమానులు తరలిరావాలని పిలుపునిస్తున్నారు. ఈ యాత్రలలో జగన్‌వెంట జడ్పీచైర్మన్ సీహెచ్ వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వరీదేవి, పీసీసీ కార్యదర్శి కేవీ సత్యనారాయణరెడ్డి, మాజీ యువజన కాంగ్రెస్‌నాయకుడు మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment