జగన్ ఓదార్పు యాత్ర శ్రీకాకుళం జిల్లాను మరిపించే రీతిలో తూర్పు గోదావరి జిల్లాలో జన నీరాజనం అందించేలా సన్నా హాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ జగన్‌ను చూసేం దుకు జనం ఇబ్బడిముబ్బడిగా తరలివస్తున్నారని ప్రచా రం ఉండడంతో జిల్లాలో మరింత ప్రతిష్టాత్మకంగా ఈ ఓదార్పు యాత్ర సాగాలనేది ఆయన వర్గీయుల వాంఛ. దీంతో గత నాలుగు రోజులుగా అన్ని ఏర్పాట్లలో జగన్ వర్గీయులు తలమునకలై ఉన్నారు. మరోపక్క రాయలసీమ నుండి స్వర్గీయ వైఎస్‌తో అనుబంధాలు పెంచుకున్న నేతలు తూర్పులో తమకు సమర శంఖారావం పూరిం చేలా యాత్ర సాగాలని పట్టుదలతో ఉన్నారు. ఆ విధమైన ఏర్పాట్లలో ఉన్నారు.
మొత్తం ఈ ఏర్పా ట్లన్నింటికీ కేంద్ర బిందువుగా జిల్లాలో అత్యంత ఆప్తుడుగా ఉన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి ఓదార్పు యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు సన్నద్ధమ య్యారు. అయితే ఈ యాత్ర పెద్దరికాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భుజ స్కంధాలపై అంతా కలిపి ఉంచారు. ఏ పనైనా చిత్తశుద్ధితో నిర్వహించే ముద్రగడ తనకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేకూర్చే రీతిలో తలమునకలయ్యారు. నిన్న మొన్నటి వరకు జిల్లా అంతా జగన్ వెనుకనే ఉంది. అయితే అధిష్టానం యాత్రకు ఆమోదంలేదని తేలడంతో భిన్న స్వరాలు మొదలయ్యాయి.
మంత్రులను, ఎమ్మెల్యేలను ఈ ఓదార్పుకు దూరంచేయాలనే తలంపుతోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారనే ప్రచారాలు సైతం జగన్ వర్గీయులు ప్రచారం చేయడంలో కృతుకుత్యులయ్యా రు. ఇదో రకంగా జనంలో జగన్‌పై అభిమానాన్ని పెంచే విధంగా తయారైంది. జనం ఎటూ వస్తారు. జగన్ యాత్రలో ఏదో ఒక చోట కలిసి మద్ధతిచ్చి వెళ్ళే విధంగా కొంతమంది ప్రజా ప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయా లను తప్పుపట్టే విధంగా అనుచరులు తయారవడంతో అటోఇటో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఇంచుమించుగా కాంగ్రెస్ శ్రేణులంతా జగన్‌ను బలపరచే విధంగా రంగం సిద్ధమైంది.
మొత్తం మీద శ్రీకాకుళం ఓదార్పు కన్నా తూర్పులో జరిగే ఓదార్పు యాత్ర అధిష్టానానికి సవాలు చేసేది ఉండాలనేది జగన్ వర్గీయుల వ్యూహం. తొలి మూడు రోజులు జగన్ యాత్ర మెట్ట ప్రాంతంలో సాగుతుంది. ముద్రగడ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత జగన్ యాత్రకు సారధ్యం వహిస్తున్న నేపధ్యంలో ఆ ప్రాంతంలో జనానికి కొదవుండదనే వాదనలున్నాయి. దీనికి తోడు ఆర్ధిక, అంగ బలాలు తోడవడంతో ఇక జనం మధ్య జగన్ అనే రీతిలో యాత్ర కొనసాగడం ఖాయం. అన్నవరం సత్యదేవుని సన్నిధి నుండి బయలుదేరుతున్న జగన్ తుని నియోజకవర్గం తొండంగి మండలం ఒంటిమామిడి నుండి ఓదార్పు యాత్రను సోమవారం మొదలుపెట్ట నున్నారు. జిల్లాలో 365 గ్రామాలు వారం రోజుల పాటు 1100 కిలోమీటర్లకు పైగా సాగే ఈ ఓదార్పు యాత్రలో 75 మంది బాధిత కుటుంబాలకు ఓదార్పు లభించ నుంది. పనిలో పనిగా జిల్లాలో ఆ రూట్‌లలో అప్పటి కప్పుడు నిర్మించిన 150కి పైగా వైఎస్ శిలా విగ్రహాలు ఆవిష్కరణలు అవుతున్నాయి. ఇదీ కార్య క్రమం.
ఇంత భారీ ఎత్తు కార్యక్రమం జగన్ వర్గీయులకు మరింత కలిసి వస్తే వారం రోజులు పది రోజులు సాగినా ఆశ్చర్యపో నక్కర్లేదు. ఎక్కడికక్కడ ప్రసంగాలతో జన కూడలిలు జగన్‌కు నీరాజనాలు పట్టడం ఖాయమంటున్నారు. జిల్లాలో 19 నియోజక వర్గాల్లో 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు ఉన్నారు. ఇద్దరు మంత్రులతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు ఓదార్పులో పాల్గొం టున్నారు. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాపాక వర ప్రసాద్‌లు తుని నుండి ముగింపు కాకినాడ వరకు ఓదార్పులో పాల్గొంటామని స్పష్టం చేస్తున్నారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ పరంగా తన హావభావాలను బహిర్గతం చేయకపోయినా ఆయనకు అటూఇటూగా ఉండే జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వరుపుల రాజా, సుధీర్‌రాజులు గత 10 రోజులుగా ద్వారంపూడితో కలిసి ఓదార్పు విజయానికి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకులు వారి వారి పరిధిలోని ఎమ్మెల్యేలకు మించి ఈ ఏర్పాట్లలో నిమగ్నమవ్వడం విశేషం. దీంతో ఎమ్మెల్యేలు సైతం విధిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద అధిష్టానాన్ని ధిక్కరించి తూర్పులో ఎమ్మెల్యేలు జగన్‌తో మమేకమవ్వడం ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయో అన్నదే ప్రశ్న. అధిష్టానం ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటే జగన్ తూర్పు నుండే తన తిరుగుబాటు జెండాను ఎగురవేస్తారని ప్రచారాలు సైతం ముమ్మరమయ్యాయి.
No comments:
Post a Comment