శ్రీకాకుళం,ఇచ్చాపురం, మేజర్‌న్యూస్: తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎటువంటి మద్దతిచ్చి ఆదరించారో తనను కూడా అదేరీతిలో ఆదరించి ఆశీర్వదించాలని కాంగ్రెస్ యువనేత, కడప ఎంపి వైస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా ప్రజలను కోరారు. జిలాల్లోని ఇచ్చాపురం నుండి గురువారం ఆయన తన ఓదార్పుయాత్రను ప్రారంభించారు. తన తండ్రి పాద యాత్ర ముగించిన స్థలం నుండే ఆయన ఈ యాత్రను ప్రారంభించడం గమనార్హం. దివంగత వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రజల్ని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ తాను బతికి ఉన్నంతకాలం మీ అందరిలో తన తండ్రి జ్ఞాపకాలను చూసుకుంటా నన్నారు.
మీరు తన తండ్రిని ఎంతగానో ఆదరించార న్నారు.తన తండ్రిని మీలో చూసుకుంటున్నానన్నారు. ఆ యన ఇంకా బతికే ఉన్నట్టు తనకు ప్రతిరోజు అన్పిస్తుం దన్నారు. ప్రజల గుండె చప్పుళ్ళు నుంచి తన తండ్రి అను భవాలను, అనుభూతులు నెమరు వేసుకుంటున్నట్టు చెప్పారు. తన తండ్రి చనిపోతూ ఈ రాష్ట్ర ప్రజలను తనకు అతి పెద్ద కుటుంబంగా ఇచ్చారని ఉద్విగ్నంగా మాట్లాడారు. గత పది నెలలుగా వైఎస్‌లేని లోటును భరిస్తూనే ఉన్నానని ఆయన అన్నారు. ఇచ్చాపురం ప్రజలు వైఎస్ జగన్‌కు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. కార్యక్రమం రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైనా జగన్ కోసం నిరీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లా కు చెందిన నాయకులు, పెద్ద తరహా నాయకులు ముఖం చాటేశారు.
ఎంపి కిల్లికృపారాణి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ ఓదార్పు యాత్రలో ఎక్కడా కనిపించలేదు.ద్వితీయ శ్రేణి నాయకు లు యాత్రను భుజాన వేసుకొని విజయవంతంగా నడిపించారు. ఇతర జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులు, నేతలు సైతం ఈ యాత్రలో పాల్గొనడం విశేషం. అనంతరం ఇచ్చాపురం నుంచి య లుదేరిన జగన్ లొద్దపుట్టి చేరుకుని పైల చంద్రమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ ఇంట్లోనే భోజనం కూడా చేశారు. అనంతరం లొద్దపుట్టిలొ తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.అనంతరం కవిటి మండలం, జగతి గ్రామంలో రెడ్డిక అప్పన్న కుటుంబాన్ని పరామర్శించారు.
జగన్ కోసం జనం పరుగులు
తమ అభిమాన నేత తనయుడు జగన్‌ను చూసేందుకు జనం పరుగులు తీశారు. గురువారం వైఎస్ అభిమాను లతో ఇచ్ఛాపురం పోటెత్తింది. జగన్ నాయకత్వం వర్ధిల్లాలం టూ నినాదాలు హోరెత్తాయి. గంటన్నర ఆలస్యంగా వచ్చిన రైలులో దిగే జగన్ ను చూసేందుకు ఉదయం ఆరు గంటలకే వేలాదిమంది రైల్వేస్టేషన్ చేరుకున్నారు. రైలు ఆగే సమ యంలో ముందుగా రోప్ పార్టీ సిద్ధపడకపోవ డంతో కొద్దినిముషాలు జగన్ లోపలే వుండిపోయారు.
హఠాత్తుగా ఆయన అభివాదం చేస్తూ కన్పించడంతో ఒక్కసారిగా జనం జగనన్నా అంటూ ఎగబడ డంతో తొక్కిసలాట జరిగింది.దీంతో స్వాగతం పలికేందుకు వచ్చిన ఇచ్చాపురం మున్సిపల్ చైర్‌ప ర్సన్ లాభాల స్వర్ణమణి కిందపడి గాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే లల్లూ , వైస్‌చైర్మన్ ఉలాల బాల య్యలు తోపులాట లో చిక్కుకున్నారు.అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు నానాపాట్లు పడ్డారు. ఆయన్ను చూసేందుకు ఒకటో నెంబరు ఫ్లాట్‌పాం పై వున్న రేకుల షెడ్డు ఎక్కడంతో అది కూ లిపోయింది. రెవిన్యూ అతిథి గృహానికి చేరుకున్న జగన్‌తో మాట్లాడేందుకు విఐపి లు క్యూ కట్టారు. మరికొందరు అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులపై విరుచుకుపడ్డారు. జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పోటీ పడ్డారు. ఆయన దృష్టిని ఆకర్షించేందుకు నేతలు పడరాని పాట్లు పడ్డారు. ఏర్పాట్లు చేసిన నర్తురామారావు , మాజీ ఎమ్మెల్యే లల్లూ ఆయన దృష్టిని ఆకర్షించేందుకు పోటీపడ్డారు.
‘తూర్పు’లో వారం రోజులపాటు జగన్ ఓదార్పు యాత్ర
కాకినాడ, మేజర్‌న్యూస్ : జగన్ ఓదార్పు యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో వారం రోజులపాటు కొనసాగుతుంది. ముందుగా పేర్కొన్నట్లు ఐదారు రోజులు కాకుండా మరో రెండు రోజులకు పెరిగింది. 11 వ తేదీ నుండి 15 తేదీ వరకు 5 రోజుల పాటు జగన్ జిల్లాలో ఓదార్పుయాత్రలో పాల్గొంటారని జగన్ వర్గీయులు ముందుగా ప్రకటించారు. శ్రీకాకుళంలో యాత్ర మొదలైన తరువాత తూర్పులో జగన్ పర్యటన ఎన్ని రోజులు ఉంటుందో ఇతమిద్దంగా ప్రకటించకపోయినా లెక్కలు కూడికల అనంతరం చివరకు గురువారం మొత్తం మీద 8 రోజులుగా జగన్ పర్యటన ఖరారు చేశారు. జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల పైగా 370 గ్రామాల్లో పర్యటన ఖరారు కావడంతో మొత్తం 8 రోజులకు మార్పు చేశారు. వైఎస్ మరణవార్తతో జిల్లాలో మొత్తం 74 మంది మృతి చెందారు. ఆ కుటుంబాలను పరామర్శిం చడం వారిని ఓదార్చటం, వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించడంవంటి కార్యక్రమాలు ఓదార్పులో భాగంగా ఉంటాయి.

No comments:
Post a Comment