దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ చీలిక దిశగా సాగనుంది. పార్టీని చీల్చి, సొంత బాట పట్టేందుకు సిద్ధమవుతోన్న జగన్ అందుకు శ్రావణమాసాన్ని ముహుర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోగా అన్ని జిల్లాల్లో ఓదార్పు యాత్రను పూర్తి చేయాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలు 14 మంది మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఆరుగురు జడ్పీ ఛైర్మన్లు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనను అనుసరిం చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
తనకు అంగ, అర్ధబలంతో పాటు ప్రచార- ప్రసార వ్యవస్థల యంత్రాగం పుష్కలంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్య మంత్రి రోశయ్య అణచివేసేందుకు కుట్ర చేస్తు న్నందున.. ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగి, అధి ష్ఠానం మెప్పుకోసం అంగలార్చడం ఆత్మహత్యా సదృశమన్న భావనతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో కౌన్సిలర్‌గా కూడా గెలవలేని వారిని సోనియా గాంధీ, రోశయ్య అందల మెక్కించి, జనబలం, ప్రజాప్రతినిధులఅండ ఉన్న తనను అవమానిస్తున్న వైఖరిపైనే జగన్ ఎక్కువగా మండిపడుతున్నారు.
తనకు వైఎస్ కుమారుడిగా ఉన్న ముద్రతో పాటు.. తన తండ్రి వల్ల రాజకీయ పునర్జన్మ పొందిన వారంతా తన వెనుకే నడుస్తారని, ప్రధానంగా క్షేత్రస్థాయిలోని యువ నాయకులు తనకు మద్దతుగా నిలుస్తారన్న ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నారు. వైఎస్ ఉన్నప్పటి రాజకీయా లకు, ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందని ఆయన వర్గీయులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొని, పార్టీలో నిలదొక్కుకునేందుకు చాలాకాలం కష్టపడవలసి వచ్చిందని, కానీ తనకు ఇప్పుడు ఆ సమస్య లేనందువల్ల ముందుకు వెళ్లడమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు జగన్ సన్నిహిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
శ్రీకాంత్‌రెడ్డి, చంద్రశేఖరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుధీర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి నేతలు ఇప్పటికే జగన్ యాత్రలో ఆయన వెన్నంటి ఉండి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధం గా నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ప్రముఖులు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనను అనుసరించేందుకు సిద్ధంగా ఉండేలా ఆయన వర్గం వ్యూహ రచన చేసింది.
కాంగ్రెస్‌లో కష్టించి పనిచేస్తున్నా, ఇంతవరకూ ఆదరణ లభించని వారిని గంపగుత్తుగా తన వైపు ఆకర్షించేందుకు జగన్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. వీరిలో ఎక్కువగా పార్టీకి ఆయువుపట్టయిన ద్వితీయ శ్రేణి నేతలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆయన ఇప్పటినుంచే వారి సమాచారాన్ని తన యంత్రాంగం ద్వారా తెప్పించు కుంటున్నారు. అదేవిధంగా సొంత పార్టీ పెడితే ఎలా ఉం టుంది అన్న అంశంపై తన సొంత యంత్రాంగం ద్వారా సర్వే నిర్వహిస్తోన్నట్లు తెలిసింది. ఆ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.
ఇదిలాఉండగా,శ్రావణమాసంలోనే జగన్ తన భవిత వ్యాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. బహుశా సెప్టెంబర్ 2వ తేదీని అందుకు ఎంచుకునే అవకాశాలున్నట్లు తెలు స్తోంది. ఆరోజు ఆయన పావురాలగుట్టకు గానీ, ఇడుపుల పాయకు గానీ వెళ్లి అక్కడి నుంచే కీలక ప్రకటన చేయ వచ్చంటున్నారు. ఆలోగా ఎమ్మెల్యేలు, ఎంపీలను తన వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నించ నున్నారు. ఇప్ప టికే కడపలో ముగ్గురు, నలుగురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా జగన్‌ను అనుసరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. కర్నూలులోనూ అదే పరిస్థితి. ఇక జగన్ దృష్టంతా ఉభయ గోదావరి జిల్లాలపైనే ఉంది. తన తండ్రికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే ఆ జిల్లాల నుంచే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవా లన్నది ఆయన వ్యూహమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పోనీ పోనీ.. పోతే పోనీ
న్యూఢిల్లీ, మేజర్ న్యూస్ ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి కుటుం బానికి, కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల అనుబం ధానికి త్వరలో తెరపడబోతోందా? ఇటు ఢిల్లీలో జరుగుతున్న తర్జన భర్జనలు, అటు ఆంధ్ర ప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. వైఎస్ తనయుడు జగన్ వ్యవహారాన్ని తెగే దాకా లాగాలన్న నిశ్చయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన ప్రదర్శిస్తున్న అంగ, అర్ధ బలాన్ని చూసి ఆయనకు ఎనలేని ప్రాధాన్యతనిచ్చే ఆలోచనలో అధినేత్రి సోనియా గాంధీ లేనేలేరని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. దీన్ని బట్టివ అధిష్టా నం అంతరంగం ఇట్టే తేటతెల్లమవుతున్నది. కడప ఎంపీ జగన్ వివాదం ఢిల్లీ స్ధాయిలో ముదురు పాకాన పడుతున్నది. జగన్ ఓదార్పు యాత్ర నాలుగు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో సాగింది.
సోమవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో మొదలు కాబోతోంది. ఈ యాత్రను కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా గమ నిస్తోంది. రాష్ట్ర పీసీసీ నుంచి రోజువారీనివేదికలు తెప్పించుకుంటోంది. జగన్ యాత్ర తాలూకూ దృశ్యాల సీడీలతో బాటు, ఆయన ప్రసంగాల ఆడియో టేపులు కూడా పీసీసీ ద్వారా అధిష్టానానికి చేరు తున్నాయి. జగన్ అధిష్ఠానం నిర్దేశించిన మార్గదర్శకాల పరిధిలో నడుచుకోవడం లేదని కేంద్ర పార్టీ నాయకత్వం ఇప్పటికే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ దశల వారీగా ఇప్పటికే ఎన్నోసార్లు అధిష్ఠానం గీసిన లక్ష్మణ రేఖను దాటారని కేంద్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దండయాత్రలాగానో, జైత్ర యాత్రలాగానో కాకుండా కేవలం కన్నీరు తుడిచే కార్యక్రమంలా నిర్వహించాలన్న సూచన కూడా అమలు కావడం లేదని అధిష్ఠానం గ్రహించినట్లు పార్టీ ఉన్నత వర్గాలు చెబు తున్నాయి.
భారీ జన సందోహాన్ని సమీకరించవద్దని, రాజ కీయ ఉపన్యాసాలు గాని, ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు గాని చేయవద్దని అధిష్ఠానం చెప్పించినా అవేవీ అమలు కావడం లేదని ఆ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. జగన్ ఇక పార్టీ వలయంలో లేరని అధిష్టానం అభిప్రాయపడు తున్నది. తొలి రోజు నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా అడిగి తెలుసుకుంటున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో ఒకటి రెండు సార్లు ఆమె ముఖ్యమంత్రి రోశయ్యతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.
జగన్ అదుపు తప్పుతున్నారనడానికి గట్టి సాక్ష్యాలను ఆయన ఉదహరించినట్లు తెలిసింది. తండ్రి ప్రాపకంతో మొదటిసారి ఎంపీ అయిన ఒక యువనేత ఒద్దికగా ఉండాల్సిన రీతిలో జగన్ ఉండటం లేదని రోశయ్య అభిప్రాయపడుతున్నారు. తన మనోగతాన్ని ఆయన అధినేత్రికి తెలియజేశారు. లెజిస్లేచర్ పార్టీలోనూ పరిస్థితి సవ్యంగా లేదన్న అంశాన్ని ఆయన గుర్తించకపోలేదు. చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ వైపు మొగ్గుతున్నా, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా చాలా వరకు నిలువరించగలిగామని ఆయన ఆమెకు తెలిపారు. జగన్ సోమవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో జరపనున్న ఓదార్పు యాత్ర మీదనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.
శ్రీకాకుళం జిల్లాలో కన్నా ఈ జిల్లాలో ఇంకా ఎక్కువగా జన సమీకరణ ఉంటుందని తెలియడంతో అధిష్ఠానం మరింత నిశితంగా పరిణామాలను పరిశీలిస్తోంది. మొత్తం మీద జగన్ అధిష్ఠానం మాటను ధిక్కరించి జనంలోకి వెళ్లారని అందుకు స్పష్టమైన సంకేతాలున్నాయని బలమైన వాదనను కేంద్ర పార్టీ నాయకులు సోనియా ముందుంచారు. కేవలం తండ్రి మరణంతో ఖాళీ అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని వారసత్వంగా తనకు అప్పగించలేదన్న ఏకైక కారణంతో జగన్ ఇలా తిరుగుబాటు జెండా ఎగరవేయడాన్ని అధిష్ఠానం ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతోంది.
జగన్ తన జన బలాన్ని అర్ధ బలాన్ని చూపదలుచుకున్నారని పార్టీలోని సీనియర్ నేతలు అధిష్టానానికి చెబుతున్నారు. అలా తన బలాన్ని ప్రదర్శించి అధిష్ఠానం మెడలు వంచాలన్నది జగన్ ఉద్దేశమని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం కన్నా తానే పైచేయి అన్న భావనను కలిగించాలని జగన్ ప్రయత్నించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అమోదించే ప్రసక్తే లేదని సోనియా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణను ఖాతరు చేయని వారు ఎంతటి వారైనా ఉపేక్షించనక్కర్లేదని..అయితే జగన్ తన తల రాతను తానే రాసుకుంటున్నందున అధిష్ఠానం పని గట్టుకుని చేయాల్సింది ఏమీ లేదని ఆమె స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. జగన్ చేస్తున్న హడావుడికి, ఆర్భాటానికి లొంగి ఆయనకు దాసోహం అనాల్సిన అవసరం లేదని సోనియా రాష్ట్ర కీలక నేతలకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరగుతోంది.
వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని, ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైందని, ప్రజలు కూడా దీన్ని గుర్తించారని ఆమె అన్నట్లు సమాచారం. జగన్ ఓదార్పు యాత్రలో స్వార్ధ ప్రయోజనాలే కనిపిస్తున్నాయని, లేకుంటే ఆయన తాను చెప్పినట్లు హంగూ ఆర్భాటం లేకుండా ఓదార్చి వచ్చేవారని ఆమె అభిప్రాయపడుతున్నారు. స్వార్ధ రాజకీయాలకు ప్రజలు విలువ ఇవ్వరని, ప్రస్తుతం జగన్ రోడ్ షోలకు వస్తున్న వారిని చూసి బలంగా భ్రమ పడనక్కర్లేదని ఆమె అంటున్నట్లు తెలిసింది.
జగన్ ఇప్పటికే తన భవిష్యత్తు ప్రణాళికను రచించుకున్నట్లు తేటతెల్లమవుతున్నదని ఆమె తన అంతరంగికుల దగ్గర అంటున్నారు. అతను తనకు తానే సవాలుగా మారి తన నిర్ణయాలను తానే తీసుకుంటున్నపుడు అధిష్ఠానం ప్రత్యేకించి చర్యలు తీసుకోవాల్సిన అగత్యం కూడా లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. అందువల్ల జగన్ తన బాట తానే చూసుకునేదాకా వేచి చూసే ధోరణిని ప్రదర్శించాలని సోనియా తన కోటరీకి పరోక్షంగా సూచించినట్లు తెలుస్తోంది.
ఏ బాటలో నడవాలి అన్న సంసిగ్ధతలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఓదా ర్పు యాత్రకు వస్తున్న స్పందనతో కొంత స్పష్టత వస్తున్నట్లు కనిపిస్తోంది. వై.ఎస్. వీరవిధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఆ తరువాత కాలంలో రాజకీయ భవిష్యత్ దృష్ట్యా జగన్‌కు కొంతదూరం పాటించారు. జగన్ యాత్రకు వస్తున్న స్పందనతోపాటు ఆ యాత్ర ద్వారా ద్వితీయశ్రేణి నేతల ఎదుగుదల కాంగ్రెస్ ఎమ్మె ల్యేల ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది. ఈ సారి కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలలో దాదాపు 74 మంది కొత్తవారు.
వీరంతా వై.ఎస్. వర్గీయులుగా ఆయన చలువ వల్లే గెలిచారు. వీరితో పాటు మంత్రివర్గంలో వారిలో అత్యధికంగా వై.ఎస్. విధేయులే. మరోవైపు వై.ఎస్.జగన్ ఓదార్పు యాత్రకు వస్తున్న జన స్పందనను చూశాక తటస్థవైఖరిని అవలంభిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ వెంట నడవాల్సిన పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఈ కారణం చేతనే వారు జగన్ బాటలో పయనించేందుకు సిద్దమవుతున్నారు. తాము జగన్‌వెంటే ఉన్నామని, యాత్రలో ఎందుకు పాల్గొనడంలేదని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తు న్నారని జోగిరమేష్ తదితర ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి పేర్కొన్న విషయం విదితమే.
ఇన్నాళ్లు పార్టీ హైకమాండ్ ఆదేశాలతో తటస్థం గా ఉన్నవారు మౌనం వీడక తప్పని పరిస్థితి కనిపి స్తోందని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కొత్తవారు 74 మంది వై.ఎస్ ఆశీస్సులతోనే గెలిచారు. వై.ఎస్. తనయుడు జగన్ వెంటవారు నడవకపోతే ఇన్నాళ్లు ఆ ఎమ్మెల్యేల వెంటనున్న జనబలంలో సహజంగానే కొంత చీలిపోయే ప్రమాదముంది.
తన నియోజకవర్గంలోనే సొంతపార్టీలోని మరో వ్యక్తి తనకు వ్యతిరేకంగా బలమైన నేతగా ఎదిగేం దుకు తమ తటస్థవైఖరి కారణమవుతుందని కొత్త ఎమ్మెల్యేల ఆందోళనకు గురవుతున్నారు. భవిష్యత్ లో ఎన్నికలు వస్తే సొంతపార్టీలోని జగన్‌వర్గంగా ఎదిగిన తన ప్రత్యర్థి, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ఇలా బహుముఖపోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని వారి ఆలోచనగా కనిపిస్తోంది. ఈ కారణం చేత కొత్తగా ఎన్నికైన 74 మందిలో మెజా ర్టీ ఎమ్మెల్యేలు జగన్ వెంట నడిచేందుకు సిద్దమవు తున్నట్లు సమాచారం. తటస్థ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలలో కూడా కొందరు ఇదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. హైకమాండ్ సంకేతాలు అందినప్పుడు జగన్ నివాసం వద్ద పెద్దగా లేని సందడి, యాత్ర ప్రారంభమయ్యాక జన స్పందన నేపథ్యంలో మళ్ళీ మొదలైందన్నారు.

ఇక జగన్ బాటే

No comments:
Post a Comment